కడప

ఈ తొమ్మిదినెలలు ఇక పోరాటమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 19: ప్రత్యేక హోదాకోసం ఈ తొమ్మిదినెలలు ఇక పోరాటమే శరణ్యమని గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈనెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం రోజున ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ప్రత్యేక హోదాకోసం నిరాహారదీక్ష చేయనున్నారన్నారు. ఈ దీక్షకు అనుబంధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో నిరాహారదీక్షలు తెలుగుదేశం పార్టీ చేయనుందన్నారు. కేంద్రం మెడలు ఎలావంచాలో మాకు తెలుసు అన్నారు. బీజేపీ సీఎం దీక్షను విమర్శిస్తోందని, ఆనాడు యుపీఏ గుజరాత్‌కు న్యాయం చేయలేదని ముఖ్యమంత్రిగా మోదీ దీక్షచేసిన విషయం గుర్తులేదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం మాపై పోరాటం చేస్తోందన్నారు. మా ఎంపీలు ప్రధాని సమక్షంలో పోరాటం చేస్తుంటే మీ ఎంపీలు ప్రధాని పాదాలపైపడి పోరాటం చేస్తున్నారన్నారు. మీ కేసుల కోసం మోదీ పేరుకూడా మీరు ఉచ్చరించలేకుండా ఉన్నారన్నారు. రెండు సంవత్సరాలు శాసనాలు చేయాల్సిన వేదికను వదిలేసిన చరిత్ర మీది అన్నారు. 21వ తేది నుండి 15రోజులుపాటు సైకిల్ యాత్రలు జరుగుతాయన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. భాషా, సంస్కారం లేకుండా ముఖ్యమంత్రిని దుర్భాషలాడటం ప్రజలు గమనిస్తున్నారన్నారు. విద్యుత్, వ్యవసాయం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఏరంగంలోనైనా ఇతర రాష్ట్రాలకంటే మన రాష్టమ్రే ఎక్కువ అభివృద్ధి చెందిందన్నారు. మీకు ఓట్లు, కుర్చీ, దోపీడీ తప్ప మరొకటి అవసరం లేదన్నారు. రాజధానికి 200 ఎకరాలు చాలని జనసేన నేత పవన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల నుండి సేకరించిన 30వేల ఎకరాల్లో 11వేలు రైతులకు, అభివృద్ధికి పోతే ఇక మిగిలేది కేవలం 7500 ఎకరాలే అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని అధికార, ప్రతిపక్షంగా టీడీపీనే వ్యవహరించాల్సివస్తోందన్నారు. చట్టాలుచేసే వేదికను బాయ్‌కాట్‌చేసి మీ అర్హతను పోగొట్టుకున్నారన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు ఢిల్లీతో పోరాటం చేస్తామన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి జరుగుతుందన్న ఆశతో నాలుగు సంవత్సరాలు వేచి చూసి ఇప్పుడు బయటకు వచ్చామన్నారు. హోదాకోసం 178 నియోజకవర్గాల్లో శుక్రవారం నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇది గాంధీజీ చూపిన మార్గమన్నారు. రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికారులు అందరూ కలిసి పనిచేయాలన్నారు. ప్రజలు స్వచ్చందంగా ఈకార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రత్యేకహోదా కోసం అందరూ కలిసి కేంద్రంపై దాడిచేయాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌ను నియమించడం సంతోషంగా ఉందని, ఆయన మంచి భక్తుడని, తిరుమలవాసుడిని సేవించే భాగ్యం ఆయనకు కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శుక్రవారం ముఖ్యమంత్రి జన్మదినం రోజు ప్రత్యేకహోదాకోసం నిరాహారదీక్ష చేస్తున్నారన్నారు. కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఒకరోజు దీక్షలు జరుగుతాయన్నారు. కేంద్రంతో ప్రతిపక్షాలు లాలూచీపడ్డాయని అందుకే ప్రత్యేకహోదా కష్టతరమైందన్నారు. జగన్మోహన్‌రెడ్డి 1800 కాదు 18వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఏమీ ప్రయోజనం దక్కదన్నారు.

నేడు రాజంపేటలో విప్ మేడా దీక్ష
* సీఎం చంద్రబాబుకు సంఘీభావం
రాజంపేట, ఏప్రిల్ 19: తన జన్మదినాన రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తలపెట్టిన ఒక రోజు నిరాహారదీక్షకు సంఘీభావంగా రాజంపేటలో విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి కూడా ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఇందుకోసం పట్టణంలోని పాత బస్టాండు కూడలి వద్ద మల్లికార్జునరెడ్డి నిరాహారదీక్ష కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గవ్యాపితంగా ఈ దీక్షలో మల్లికార్జునరెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. దీంతో పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. పట్టణంలో పాత బస్టాండు కూడలి అత్యంత ముఖ్యమైన కూడలి కావడంతో దీక్షవల్ల ఎలాంటి ఇబ్బందులు వాహనాల రాకపోకలకు కాని, వివిధ వర్గాల ప్రజలకు ఏర్పడకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించారు. మల్లికార్జునరెడ్డితో పాటు నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనేతలు కూడా రిలే దీక్షలో కూర్చొననున్నారు. ఇప్పటికే చంద్రబాబునాయుడు దీక్షకు సంఘీభావంగా రాజంపేటలో చేపట్టనున్న దీక్షను విజయవంతం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాయి.
సీఎం బాబుకు అందరూ సంఘీభావం తెలపాలి : మేడా
ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ చంద్రబాబునాయుడు తన జన్మదినాన చేపట్టనున్న ఒక రోజు నిరాహారదీక్షకు అన్ని వర్గాల ప్రజలు తమ సంపూర్ణ సంఘీభావం తెలియజేయాలని విప్ మేడా మల్లికార్జునరెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యత నిస్తూ ప్రజల కోసం తపించే చంద్రబాబు లాంటి విజన్ కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్‌కు లభించినందునే కేంద్ర ప్రభుత్వం నుండి ఆశించిన నిధులు రాకున్నా సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. అలాగే నూతన రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణాలు అంతర్జాతీయస్థాయికి తగ్గకూడదన్న దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా రాజధాని, పోలవరం నిర్మాణాలు ఆగకూడదన్న లక్ష్యంతో వివిధ మార్గాల్లో నిధుల సమీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టి ముందుకు సాగడం సాహసోపేత చర్యగా మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అభివర్ణించారు. కట్టుబట్టలతో బయటకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం తన వయసును కూడా లెక్కచేయకుండా రోజుకు 18 గంటలు పనిచేస్తున్న చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు నిలవడం మన భావితరాల కోసం అవసరమని గుర్తించాలని మేడా వివరించారు.