కడప

చక్రస్నానంతో ముగిసిన పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వల్లూరు, ఏప్రిల్ 22: పవిత్రపుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో 9రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీచెన్నకేశవుల స్వాముల బ్రహ్మోత్సవాలు అదివారం త్రిశూల చక్రస్నానం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. శ్రీవైద్యనాథేశ్వరస్వామి త్రిశూలేశ్వరునికి, శ్రీచెన్నకేశవస్వామి చక్ర తాల్వార్ల స్నానాలను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. పుష్పగిరి గ్రామంలోని శ్రీవైద్యనాదేశ్వరస్వామి ఆలయం నుండి కామాక్షి సహిత వైద్యనాధుడిని త్రిశూలాన్ని కొండపై నుంచి శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామికి శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామిని చక్ర ఆల్వార్‌ను ఊరేగింపుగా పెన్నానది వద్దకు తీసుకొచ్చారు. పెన్నానది వద్ద భక్తిశ్రద్దలతో భక్తులు కాయ కర్పూరాలు సమర్పించారు. అనంతరం శాస్త్రోక్తంగా త్రిశూలం, సుదర్శన చక్రాలకు పూజలు నిర్వహించారు.
కనులపండువగా పుష్పయాగం
ఆదివారం సాయంత్రం చెన్నకేశవస్వామికి పుష్పయాగాన్ని కనుల పండువగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామికి వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. ఈకార్యక్రమంలో అర్చకులు, ఉభయదారులు పాల్గొన్నారు.