కడప

ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన గురు పూజ మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బి.మఠం, ఏప్రిల్ 22: ఆదివారం ఉదయం 325వ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆదివారం ఆలయంలో శ్రీవీరబ్రహ్మేంద్ర సుప్రభాతం నామ సంకీర్తనలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం అభిషేకం, సహస్రనామార్చన, వేదపండితులచే హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధ్వజరోహన కార్యక్రమంలో వేద పండితులు పూజలు నిర్వహించారు. స్వామివారి సజీవ సమాధి దైవదర్శనం కోసం భక్తులు భారీఎత్తున తరలి వస్తున్నారని, వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల ఆదేశానుసారం భారీ ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకఏర్పాట్లు చలువ పందిర్లు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చేపట్టామని, ఆలయ పరిసరప్రాంతాలన్ని విద్యుత్ దీపాలతో మిరిమిట్లుగొలిపేట్టు నిర్వహించామన్నారు. రాత్రి 7 గంటలకు శేషవాహనోత్సవం నిర్వహించామన్నారు. సోమవారం సుప్రభాతం, నామసంకీర్తనం, అభిషేకాలు, సహస్ర నామార్చన, రాత్రి 10 గంటలకు స్వామి వారి గజ వాహనోత్సవం, మంగళవారం సుప్రభాతం, నామసంకీర్తనం, అభిషేకాలు, సహస్రనామార్చన, ఉదయం 10 గంటలకు ఉత్సవం, రాత్రి 10 గంటలకు స్వామి వారి నరనందీ ఉత్సవం, బుధవారం సుప్రభఋ౎తం, నామసంకీర్తనం, అభిషేకాలు, సహస్ర నామార్చన, మధ్యాహ్నం 12 గంటలకు దీక్షా బంధనాలంకరణోత్సవం, రాత్రి 11 గంటలకు స్వామివారి నందీ ఉత్సవం, 26వ తేదీన సాయంత్రం 4 గంటలకు బ్రహ్మరథోత్సవం, రాత్రి గజ వాహనోత్సవం, 27వ తేదీన ఉదయం 10 గంటలకు ఉత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రసాద వినియోగం ఉంటుందని వివరించారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్టీసీ బస్సులను అన్ని మార్గల్లోనూ నడుపుతున్నట్లు తెలిపారు.

ప్రతి చెరువును నీటితో నింపుతాం
* టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి

పులివెందుల, ఏప్రిల్ 22: పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు నీళ్ళను నింపి తాగునీటి సమస్య లేకుండా చూస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, పులివెందుల ఇన్‌చార్జి సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ సమీపంలోని వెంకటాపురం పంప్ హౌస్ వద్ద మోటర్లును ఆన్‌చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందులకు క్రిష్ణా జలాలను 10 టియంసిలను తీసుకురావడం జరిగిందని తిమ్మాయపల్లె మండలం, పైడిపాళెం ప్రాజెక్టుకు 4 టీఎంసీలు, లింగాల మండలం, చిత్రావతి రిజర్వాయర్‌కు 6 టీఎంసీ నీళ్లను తీసుకురావడం జరిగిందన్నారు. గత 10 సంవత్సరాల పులివెందుల ప్రాంత రైతులకు నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో బోరు బావులు తవ్వడానికే రైతులు అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని పులివెందులలో నీటి సమస్యలను తీర్చాలనే ఉద్ధేశ్యంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లి ఈ రోజు పులివెందుల నీటి సమస్యలు లేకుండా చేశామన్నారు.