కడప

ఇనే్నళ్లకు గుర్తొచ్చిన ఏపీ కార్ల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 22: పులివెందుల పట్టణ శివారులో ప్రతిష్టాత్మకంగా నిర్మింపబడిన ఏపీ కార్ల్ (ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసర్చ్ ఆన్ లైవ్‌స్టాక్) భవనాలు ఇనే్నళ్లూ నిరుపయోగంగా పడివున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో దాదాపు 660 ఎకరాల్లో రూ.380కోట్లతో ఈ పశుపరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 2009లో భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆసియా ఖండంలోనే దీన్ని ఒక కీలకమైన పశుపరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దాలని వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. పాడి పశువులకు ముఖ్యంగా ఆవులకు సంబంధించిన జీవశాస్త్ర, కణజాల శాస్త్రాలపై విస్తృతమైన పరిశోధనలు చేసేందుకు భారతదేశంలోని అన్ని ప్రధాన యూనివర్సిటీల యూనిట్లను ఇక్కడికి ఆహ్వానించాలని ఆయన ఉద్దేశ్యంగా ఈ సంస్థ ఏర్పాటైంది. అయితే 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఈ పశుపరిశోధన కేంద్రాన్ని ప్రభుత్వాలు మరిచిపోయాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిశోధన కేంద్రం ఊసే ప్రభుత్వం ఎత్తలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టిన 3ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసర్చ్ ఆన్ లైవ్‌స్టాక్2 (ఐజికార్ల్) పేరును, ఏపీ కార్ల్‌గా మార్చడం మినహా ఈ పరిశోధన కేంద్రంలో ఎటువంటి పరిశోధనలు జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేకసార్లు కడప జిల్లాకు, పులివెందుల నియోజకవర్గానికి వచ్చినప్పటికీ, జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, ఏరోజూ ఈ ఏపీ కార్ల్ ప్రస్తావనే తీసుకురాలేదు. ప్రతిష్టాత్మకంగా నిర్మింపబడిన ఏపీ కార్ల్‌లో వౌళిక సదుపాయాలైన విద్యుత్, నీళ్ల సరఫరాకే తీవ్ర ఆటంకాలు ఏర్పడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యుత్ తీగలు భవనం వరకు స్థంభాలపై వచ్చినా, భవనంలోపల భూగర్భంలో కేబుళ్లు వేయడంవల్ల అనేకచోట్ల కనెక్షన్లు తెగిపోయి విద్యుత్ అంతరాయం కలుగుతోంది. అలాగే నీటి సరఫరా లేదు. ఈ వౌళిక సదుపాయాలు ఏర్పాటుచేసుకునేందుకు లేదా పునరుద్దరించుకునేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఈసంస్థది. ఈసంస్థ ఉద్దేశాలు, ఇక్కడ జరిగే పరిశోధనల వల్ల జరిగే ప్రయోజనాలు తెలిసిన వాళ్లంతా, ఈ పరిశోధన సంస్థ మూలనపడటం పట్ల వేదన పడుతున్నారు. దేశానికే గర్వకారణమైన సంస్థగా ఎదగాల్సిన ఏపీ కార్ల్ ఎందుకూ ఉపయోగపడని సంస్థగా రోజురోజుకు అధ్వాన్న స్థితికి చేరుతోంది. అక్కడ 500లు పైగా ఆవులు ఉన్నాయని, పరిశోధనలు జరుగుతున్నాయని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పినప్పటికీ, అన్ని ఆవులు కూడా లేవన్నది వాస్తవం.
అకస్మాత్తుగా ఆర్భాటం వెనుక వ్యూహం
జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి పశుసంవర్థకశాఖ మంత్రి కావడంతో, జిల్లాలోనే ఉన్న ఆశాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక ఏపీకార్ల్‌ను పట్టించుకోవడం లేదనే విమర్శలను అధిగమించేందుకు, రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పులివెందుల నియోజకవర్గంలో ఏదో చేస్తున్నామనే ప్రచారం చేసుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? శనివారం మంత్రి ఆదినారాయణరెడ్డి ఉన్నట్లుండి సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజి (సీసీఎంబి) టీమ్‌ను, పశుసంవర్థక మత్స్యశాఖల రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణతివేదిలను ఇక్కడకు రప్పించి పరిశోధన సంస్థలో సమావేశం నిర్వహించారు. ఇనే్నళ్లూ ఈ సంస్థకు విద్యుత్ సరఫరా కావడంలేదని, పశుగ్రాసం పండించేందుకు నీళ్లులేవనీ, ఇంకా సరైన వౌళిక సదుపాయాలేవీ భవనాల్లోనూ, ఆవరణలోనూ లేవనీ అక్కడ ఉన్న ఒకరిద్దరు శాస్తవ్రేత్తలు మొరపెట్టుకున్నా వినే నాధుడు లేడు. అకస్మాత్తుగా మంత్రి శనివారం సీసీఎంబీ టీమ్‌ను రప్పించి, తమశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని తీసుకొచ్చి సమావేశం నిర్వహించడం వెనుక, పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం కోసమేనని విమర్శలు విన్పిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం సంక్షేమపథకాలకే నిధులు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ఎన్‌టిఆర్ గృహనిర్మాణాలకు బిల్లులు చెల్లించలేకపోతోంది. అర్హులైన పెన్షన్‌దారులకు పెన్షన్లు ఇవ్వలేకపోతోంది. కొత్తరేషన్‌కార్డులు మంజూరు కావడంలేదు. ఇటువంటి సంక్షేమపథకాలకే నిధులు ఖర్చుచేసే స్థితిలోలేని ప్రభుత్వం, పశుసంవర్థకశాఖకు వందలకోట్లరూపాయలు కేటాయించి ఏపీకార్ల్‌ను, దాని స్థాపన లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తుందనుకోవడం అత్యాశగానే కనిపిస్తోంది. ఇనే్నళ్లూ దీని ఊసెత్తని మంత్రి, ఈ ఎన్నికల ఏడాదిలో అక్కడ ఆర్భాటం చేయడం కేవలం రాబోయే ఎన్నికలకోసం జరిపే ప్రచారంలో భాగంగానే చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్ళలు కేవలం విమర్శలేనని, తమకు చిత్తశుద్ది వుందని ప్రజలకు తెలియాలంటే వెంటనే ఏపీకార్ల్‌లో వౌళిక సదుపాయాలన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సివుంది. వివిధ యూనివర్సిటీలను ఇక్కడికి రప్పించి, వారిని మెప్పించి , పరిశోధన యూనిట్లు పెట్టించేందుకు సంసిద్ధం చేయాల్సి వుంది.