కడప

గ్రామస్వరాజ్యం వస్తేనే దేశం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 24: బాపూజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ టి.బాబూరావునాయుడు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షత వహించారు. సమావేశానికి ముందు అధికారులంతా జ్యోతి ప్రజ్వలనచేసి మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు పట్టుకొమ్మలాంటివారని అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడంలో ప్రతి సర్పంచ్ క్రియాశీలంగా ఉండాలన్నారు. గ్రామాల రూపురేఖలు మార్చగల శక్తి సర్పంచ్‌లకే దక్కుతుందన్నారు. పాలనలో ఎన్నిమార్పులు వచ్చినా గ్రామాలు పంచాయతీరాజ్ వ్యవస్థ కిందనే పనిచేస్తాయన్నారు. సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీవోలు సమన్వయంతో పనిచేయడం వల్లనే జిల్లాను ఓడిఎఫ్‌లో ప్రధమంగా ప్రకటించగలిగామని కలెక్టర్ అన్నారు. రాజ్యాంగంలో జరిగిన 73వ రాజ్యాంగ సవరణ 1993 ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చిందని, దీంతో ప్రతి ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపంచాయతీలో మంచినీరు, రోడ్లు, విద్యుత్ వంటి అన్నివౌళిక సదుపాయాలు సమకూర్చి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుంచేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. జడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ జిల్లాలోని 790గ్రామపంచాయతీలను ఆదర్శ పంచాయతీలుగా అభివృద్ధిచేసేందుకు పంచాయతీరాజ్ శాఖ చొరవచూపాలని అన్నారు. సర్పంచ్‌లు గ్రామపంచాయతీలకు మూలస్థంభాలు లాంటి వారని, నిధులు ఖర్చుచేసే అవకాశం వారికే ఉందన్నారు. ఈసమావేశంలో జడ్పీ ఇన్‌చార్జి సీఇవో నాగేశ్వరరావు, జడ్పీ సీఇవో ఖాదర్ బాషా, డ్వామా పీడీ హరిహరనాధ్,పట్టుపరిశ్రమశాఖ ఏడి రాజశేఖరరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఇ నరసింహారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సంజీవరావు, జెడ్పి డిప్యుటీ సిఇవో రెడ్డయ్యనాయుడు, రాష్ట్ర పంచాయతీ సర్పంచ్‌ల అధ్యక్షురాలు కుసుమకుమారి, పిఆర్ మినిస్ట్రిరియల్ రాష్ట్ర సంఘం నాయకులు నాగిరెడ్డిలు పాల్గొని పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క విధి విధానాలపై మాట్లాడారు.
ఉత్తమ పంచాయతీలకు విశిష్ట సేవలందించిన వారికి ప్రోత్సాహకాలు
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జిల్లాలో నిధులు దుర్వినియోగం లేకుండా ఆడిట్ ముగించుకున్న పంచాయతీలను ఈ-పంచాయతీ సమగ్రంగా ఆన్‌లైన్‌లోనిర్వహించిన పంచాయతీలను, సొంత ఆదాయ వనరులు ,తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ లో ప్రతిభావంతంగా పనిచేసిన పంచాయతీలను ఎంపికచేసి రూ.6లక్షల ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఇందులో మొదటి బహుమతి వేంపల్లెగ్రామపంచాయతీకి రూ.3లక్షలు, రెండవ బహుమతి కోడూరు గ్రామపంచాయతీకి రూ.2లక్షలు, మూడవ బహుమతి కమలాపురం గ్రామపంచాయతీకి రూ.లక్ష అందజేశారు. ఈ మొత్తాలను జీపీడీపీలో ఆమోదించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఖర్చు చేయాల్సివుంటుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో జిల్లాలోవిశిష్ట సేవలందించిన 55 మందికి మెమెంటోలు, ప్రశంసాపత్రాలు కలెక్టర్ అందజేశారు.