కడప

నేరాల నియంత్రణకు సాంకేతికతను ఉపయోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 24: నేరాలు నియంత్రించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ సూచించారు. సాంకేతికత వల్ల ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చునన్నారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్), ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్ వర్కింగ్ సిస్టమ్ (ఎఫ్‌పిఎన్‌ఎస్), ప్రాపర్టి ఐడెంటిఫికేషన్ నెట్ వర్కింగ్ సిస్టిమ్ (పిఐఎన్‌ఎస్)లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. వేసవి నేపధ్యంలో, చాలా మంది సొంత ఊర్లకు పోయి వుంటారనీ, ఇండ్లలో చోరీల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గస్తీ ముమ్మరం చేయాలన్నారు. రోడ్డ్భుద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలు గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మట్కా, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లపై పకడ్బంధీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎర్రచందనం అక్రమరవాణాపై కఠినంగా వ్యవహరించాలని, ఎవరైనా లాలూచీపడితే తీవ్ర చర్యలు తప్పవని ఆయన అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ అద్నాన్ నరుూ అస్మీ, మరో అదనపు ఎస్పీ శ్రీనివాసులురెడ్డి, పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు, ట్రైనింగ్ ఏఎస్పీ వకూల్ జిందాల్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీలు చంద్రశేఖర్, రాజగోపాల్‌రెడ్డి, కడప డీఎస్పీ షేక్ మాసూంబాషా తదితరులు పాల్గొన్నారు.
జమ్మలమడుగు అర్బన్ సీఐ, వేంపల్లె ఎస్‌ఐలకు స్ఫూర్తి అవార్డులు
ప్రతినెల ఉత్తమపనితీరు కనబరచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ అట్టాడ బాబూజీ స్పూర్తిపేరిట అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ నేరసమీక్షా సమావేశం అనంతరం జమ్మలమడుగు అర్బన్ సీఐ ప్రవీణ్‌కుమార్, వేంపల్లె ఎస్‌ఐ బివి చలపతిలకు ఎస్పీ అట్టాడ బాబూజీ స్ఫూర్తి అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందించారు.