కడప

ప్రత్యేక హోదా ఉద్యమంలో ఉద్యోగులు రోడ్డెక్కరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 24: ప్రత్యేకహోదా ఉద్యమంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఎన్‌జివోలు రోడ్డెక్కి ఉద్యమం చేసే పరిస్థితి లేదనీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. రాజకీయపార్టీలు ప్రత్యేకహోదా ఉద్యమం చేస్తున్నాయని, ప్రజల్లో వీరు ఉద్యమంపట్ల విశ్వసనీయత కలిగించకలేకపోతున్నారనీ ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత ప్రత్యేకహోదాను ఏ రాజకీయపార్టీ తెస్తుందో తేల్చిచెప్పాలని ఆయన అన్నారు. మంగళవారం కడపలోని ఎన్‌జివో హోమ్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చిన యంత్రాంగం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందని, ఎవరికివారు చేస్తున్న ప్రత్యేకహోదా ఉద్యమంలో ఉద్యోగులు రోడెక్కేపరిస్థితి లేదని ఆయన అన్నారు. రాష్ట్రప్రగతి, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలులో ఉద్యోగులు పాలుపంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని రాజకీయపార్టీలు వచ్చే ఎన్నికలు దృష్టిలోపెట్టుకుని ఈహోదా ఉద్యమాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు ఏకమై ఉద్యమం ఉధృతమైతే తప్పని పరిస్థితుల్లో తాము కూడా ఉద్యమంలో పాల్గొంటామని తెలిపారు. రాష్ట్రాన్ని విడదీసే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు పోటీలుపడి విభజన చట్టంలో పాల్గొన్నాయని, అయితే ఇప్పుడు విభజన చట్టాలను అమలు చేయబోమని ప్రత్యేకహోదా ఇచ్చే ప్రసక్తేలేదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పట్టుబట్టి రాష్ట్రాన్ని విభజించిన పార్టీ నేతలు కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ఉద్యమాల్లో పాల్గొనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని, బీజేపీ ప్రత్యేకహోదాపై మాటమీద నిలబడకపోతే , గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కుపట్టిన గతే బీజీపీకి తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమాలు ఏపార్టీకి ఆపార్టీ ముందస్తు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని హడావిడి చేస్తున్నాయని, అన్నిపార్టీలు ఏకతాటిపైకి రాకపోతే ఈ హోదా ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకమే అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయపార్టీలు ఒక వేదికమీదకు రావాలని అశోక్‌బాబు పిలుపునిచ్చారు. తమవంతుగా ప్రత్యేకహోదా కోసం మేనెల 9వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘాలు ధర్నాలు నిర్వహించనున్నాయని వెల్లడించారు.
పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయాలి
కొత్త పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రప్రభుత్వానికి నివేదించడమేగాకుండా ఆర్థిక మంత్రిని కలిశామని అశోక్‌బాబు అన్నారు. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు లేకపోవడం వల్ల కొత్త పిఆర్సీ కమిషన్ ఏర్పాటుచేయలేక పోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించిందని , అయినప్పటికీ సీనియర్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఈనెల చివరిలో ఈ కమిటీని వేసే అవకాశాలున్నాయన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సీపీఎఫ్ వేయాలని దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. దీనిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అశోక్‌బాబు వెల్లడించారు. ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయని, అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బలవంతపు వత్తిళ్లు తేవడం లేదని ఆయన తెలిపారు. అలాగే ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలనే ప్రతిపాదన చేశామని ,దీనిపై ఈనెల చివరినాటికి వారి వేతనాలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.