కడప

జిల్లాలో తగ్గుముఖం పట్టిన మలేరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,ఏప్రిల్ 24: జిల్లాలో మలేరియా తగ్గుముఖం పడుతోందని మలేరియా అధికారి త్యాగరాజు అన్నారు. ఈనెల 25న ప్రపంచమలేరియా దినోత్సవం సందర్భంగా నగరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశం నిర్వసించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో ఉమామహేశ్వరీ మాట్లాడుతూ సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో పనిచేస్తూ సర్ రోనాల్డ్‌రోస్ అనే శాస్తవ్రేత్త ఏప్రిల్ 25న ప్లాస్‌మోడియం అనే పరానజీవి ద్వారా మలేరియాజ్వరం వస్తుందని కనిపెట్టారన్నారు. ఈ మలేరియాకు ఆడ అనాఫిలస్ దోమలు వాహకాలుగా పనిచేస్తాయని ప్రపంచానికి చెప్పిన రోజు ఏప్రిల్ 25 అన్నారు. దీనికి గుర్తుగా ఈరోజును ప్రపంచమలేరియా దినోత్సవంగా గుర్తించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా మలేరియా నివారణకోసం డబ్ల్యుహెచ్‌వో ‘రెడి టు బీట్ మలేరియా’ అన్న నినాదాన్ని చేస్తోందన్నారు. అనంతరం జిల్లా మలేరియా అధికారి త్యాగరాజు మాట్లాడుతూ కడప జిల్లాలో 2013 నుంచి 2018 వరకు ఉన్న డెటా ప్రకారం మలేరియా, డెంగ్యు, చికున్‌గున్యా చాలా తగ్గుముఖం పట్టిందన్నారు. 2013లో మలేరియా 247, డెంగ్యు 3, 2014లో మలేరియా 407, డెంగ్యు 11, 2015లో మలేరియా 352, డెంగ్యు 221, 2016లో మలేరియా 866, డెంగ్యు 13, 2017లో మలేరియా 521, డెంగ్యు 103, చికున్ గున్యా 4, 2018లో ఈరోజువరకు మలేరియా 47, డెంగ్యు 6 కేసులుగా నమోదయ్యాయన్నారు. దీని ప్రకారం పరిశీలిస్తే మలేరియా కేసుల్లో 60శాతం కేసులు వైవాక్స్ , పిఎఫ్ మలేరియా 40శాతంగా ఉన్నాయన్నారు. డెంగ్యు కేసుల్లో ప్రతి సంవత్సరం సగం కేసులు పట్టణ ప్రాంతాల నుండే ఎక్కువగా వస్తున్నాయన్నారు. ప్రతి జూన్ నెల నుండి డిసెంబర్ వరకు పట్టణ ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్లు, ఎంహెచ్‌వో, శానిటరీ సిబ్బంది పారిశుద్ధ్యం పట్ల, దోమల పెరుగుదల నివారణ పట్ల తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాయచోటి, రామాపురం, ఎల్‌ఆర్‌పల్లి, సంబేపల్లి, వీరబల్లి, టి.సుండుపల్లి, గాలివీడు, చిన్నమండెం, చింతకొమ్మదినె్న, ఎర్రగుంట్ల, మైలవరం, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరులో మలేరియా రిస్క్‌మండలాలుగా గుర్తించామన్నారు. జిల్లాలో డెంగ్యు రిస్ట్ మండలాలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నారు. కీటక జనిత వ్యాధుల నివారణకు పలు చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. అన్ని పిహెచ్‌సిలలో తగు స్థాయిలో మలేరియా మందులు , క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచామన్నారు. రాబోవు సీజన్లలో అందరి సహకారంతో పనిచేసి సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా అరికట్టగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లా మలేరియా అధికారి ప్రమోషన్‌పై బదిలీ
జిల్లా మలేరియా అధికారి త్యాగరాజుకు ప్రమోషన్‌పై కడప జోన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. బుధవారం నగరంలోని పాతరిమ్స్‌లోని కార్యాలయంలో ఆయన పదవీబాధ్యతలు చేపట్టనున్నారు.