కడప

రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 24: రాయలసీమ రాష్టమ్రే రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ లక్ష్యమని ఏకగ్రీవంగా ఆ పార్టీ ప్లీనరీ సమావేశం ఆమోదించింది. స్వాతంత్య్రం రాకముందు నుండీ, స్వాతంత్య్రం వచ్చాక, భాషా ప్రయుక్తరాష్ట్రంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా రాయలసీమకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయని పార్టీ తీర్మానించింది. ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాయలసీమకు అన్నాయం జరుగుతూనే ఉందనీ, ఎన్నిసార్లు రాయలసీమ సమస్యలను మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు చెవికెక్కించుకోలేదని,ప్రత్యేక రాష్టమ్రే తమకు చివరి పరిష్కారమని ఆపార్టీ అభిప్రాయపడింది. మంగళవారం రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ కార్యాలయంలో ఏర్పాటైన ప్లీనరీ సమావేశంలో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి, కమిటీ సభ్యులు శ్రీనివాసులు, సీనియర్ నేత కె.లింగమూర్తి, ఇతర నేతలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మద్రాసు నుంచి రాష్ట్రం విడిపోవాలనే ఉద్యమం జరిగే రోజుల్లో, రాయలసీమకు అన్యాయం చేయబోమని 1937లో శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందం ప్రకారం 1953లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధానిని రాయలసీమలోని కర్నూలులో ఏర్పాటుచేసి మూనాళ్ల ముచ్చటతీర్చి, హైదరాబాద్‌కు తీసుకుపోయారని పార్టీనేతలు చరిత్రను గుర్తు చేశారు. అప్పటి నుండి రాయలసీమకు అన్యాయాలు జరగడం ఆనవాయితీగా మారిందన్నారు. కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టు నుండి సిద్దేశ్వరం దాకా అన్ని సందర్భాల్లో రాయలసీమ త్యాగాలే చేసి మోసపోయిందన్నారు. కేసీ కెనాల్ మినహా లక్ష ఎకరాలకు నీరు ఇచ్చే ఒక్కసారి సాగునీటి ప్రాజెక్టు కూడా రాయలసీమలో ఇంతవరకు పూర్తికాలేదని వారు అన్నారు. నిర్మాణంలో ఉన్న హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తిచేయాలని విభజన చట్టం చెబుతున్నా ప్రభుత్వాలు ఆ ప్రయత్నమే చేయలేదన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం రాయలసీమ ప్రాంతానికి నీటి సమస్యను పరిష్కరించలేకపోయింది కాబట్టి తమ రాష్ట్రం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాయలసీమ ప్రాంతంలో వెయ్యిమంది కార్మికులు పనిచేసే ఒక్కటంటే ఒక్కటి ప్రభుత్వరంగ సంస్థ కూడా స్థాపించకపోవడం ఈ ప్రాంతంపట్ల ప్రభుత్వాలకు ఉన్న చులకన భావాన్ని స్పష్టం చేస్తోందన్నారు. రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా విడిపోయిన తర్వాత శ్రీబాగ్ న్యాయసూత్రాల ప్రకారం రాయలసీమకు రావాల్సిన రాజధానిని ఇవ్వలేదన్నారు. మొదట చెన్నై మహానగరాన్ని రాయలసీమవాసులు వదలుకున్నారు, కర్నూలు రాజధానిని కోల్పోయినారు, హైదరాబాద్ నగరాన్ని వదలాల్సి వచ్చింది, న్యాయంగా తమకు రావాల్సిన రాజధానిని ఇవ్వకుండా కోస్తాప్రాంతంలో నిర్మించుకుంటున్నారని వారు తీవ్రంగా ఆక్షేపించారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని ఇక్కడి న్యాయవాదులు, ప్రజలు కోరుతుంటే ఘోరంగా అవమానిస్తున్నారన్నారు. రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటుచేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. అనంతపురం జిల్లాకు రైల్వేజోన్‌ను, కర్నూలులో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని విభజన చట్టంలో చెప్పిన ఉక్క్ఫ్యుక్టరీని, ప్రధానమంత్రి శంకుస్థాపనచేసిన మన్నవరం ప్లాంట్‌ను, నందలూరు రైల్వే లోకోషెడ్‌ను, అన్నింటినీ పక్కన పడేశారన్నారు. రాయలసీమ వాసులకు నీళ్లు లేక, ఉపాధిలేక, చదువులేక, పౌష్టికాహారం లేక కేవలం కరవులతో, వలసలతో బ్రతకడానికి ఈ రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదని వారు తీవ్రంగా ఆక్షేపించారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలకు నిలయమైన రాయలసీమ ప్రాంతం తన భాషను, యాసను అవమానపరుస్తుంటే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. జరిగిన కుట్రలు, వారుచేసిన అన్యాయాలు, తాము చేసిన త్యాగాలు ఇంక చాలని, ప్రత్యేక రాష్టస్రాధన మహోద్యమానికి ప్రజలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సాధించేవరకు రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ కృషి చేయాలని, చేస్తుందని, ప్రజలు అండగా నిలవాలని వారు కోరారు. వెనుకబడిన ప్రాంతాలన్నీ తమ న్యాయమైన కోర్కెకు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. ఈసమావేశంలో శేఖర్, సిద్దిరామయ్య, వెంకటేశ్వర్లు,సుబ్బరాయుడు తదితరులు పాల్గొని ప్రసంగించారు.