కడప

ప్రజల రక్షణ కోరుతున్నావంటే నీ తప్పులు ఎన్నో ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ, ఏప్రిల్ 26: కేంద్రం నుండి తనకు ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజలందరూ కలిసి రక్షణ కల్పించాలని చంద్రబాబు కోరుతున్నారంటే మీ తప్పులు ఎన్నో చెప్పాలని రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి గురువారం ప్రశ్నించారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తానే తప్పులుచేస్తూ వ్యవస్థనే తప్పులు పట్టడం ఆయనకు నైజంగా మారిందన్నారు. తనకు అనుకూలంగాలేరని గవర్నర్ల వ్యవస్థను తప్పుపడుతున్నారన్నారు. గవర్నర్‌మేలు చేయకపోయినా, కీడు చేయరన్నారు. మరి స్పీకర్ వ్యవస్థను ఎవరు తప్పుపట్టాలని ప్రశ్నించారు. సభను నడిపే స్పీకర్ సమన్యాయం పాటించాల్సివుండగా కేవలం టీడీపీ వారిని మాట్లాడిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలను మాట్లాడనీయకుండా అడ్డుకోవడం, కార్యకర్తల మీటింగ్‌లకు వెళ్లడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివిచేసే స్పీకర్‌ను ఏమనాలని అన్నారు. రాష్ట్రాన్ని రూ.90వేలకోట్ల అప్పుల నుండి రూ.21 కోట్ల 30లక్షల కోట్లకు అప్పులు పెంచిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లకు రూ.కోట్లు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ఎన్‌డిఏలోనూ, బీజేపీలోనూ చక్రం తిప్పిన నీవు అప్పుడు గవర్నర్ వ్యవస్థను ప్రశ్నించలేదన్నారు. భోజనం మానేసిన ఒక్కరోజుకు రూ.30కోట్లు ఖర్చుపెట్టావన్నారు. ప్రజలు పన్నులుకట్టలేక అల్లాడుతున్నారన్నారు. పెరిగిన పెట్రోల్ ధర ప్రజలను పీడిస్తోందన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే వైసీపీని ఎలా నిందిస్తామని ప్రశ్నించారు. నీ దీక్షలకు విద్యార్థులను, డ్వాక్రా మహిళలను బలవంతంగా పిలిపించుకుని విజయవంతమయ్యాయని డాంబికాలు చెబుతున్నావని ఎద్దేవా చేశారు. ప్రజలకు 600 హామీలు ఇచ్చినందుకు 600రోజులు దీక్ష చేయాలన్నారు. కడప జిల్లాను పూర్తిస్థాయిలో విస్మరించావని, ఎదురుదాడి సిద్దాంతాలు మానుకోవాలని హితవుపలికారు. కేవలం మిగిలివున్న ఒక్క ఏడాదైనా మంచిగా పనిచేసి ప్రజల మన్ననలుపొందాలని సూచించారు.

బాల్య వివాహాలను అడ్డుకున్న సీడీపీవో
సుండుపల్లె, ఏప్రిల్ 26: మండల పరిధిలోని రాయవరం పంచాయతీ బోనంవాండ్లపల్లెలో, మడితాడు గ్రామంలో ఉండే వడ్డెపల్లెలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు బాల్య వివాహాలను సీడీపీవో వసంతభాయి నిలిపివేయడం జరిగింది. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తనకు సమాచారం అందడంతో ఈ ప్రాంతాలకు వచ్చి బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని వారి తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ ఇవ్వడంతోపాటు విద్యార్థులను చదివించాలితప్ప పెళ్ళిళ్లు చేయకూడదని, చిన్న వయసులో వివాహాలు జరిగితే వారికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని చదువుకుని ఆడుకునే వయసులో బాల్యవివాహాలు వద్దని సీడీపీవో వారి తల్లిదండ్రులకు వివరించారు. దీనికి బదులుగా వారి తల్లిదండ్రులు తమకు తెలియదని మామూలుగా చేశామన్నారు. దీంతో వారివద్ద నుండి పెళ్లి కొడుకు తరపు నుండి వెలుగును వెలుగులు తరపు నుండి రాతపూర్వకంగా బాల్యవివాహాలు చేయమని అంగీకరిస్తూ ఇరు కుటుంబాల దగ్గర రాయించుకున్నారు. బాల్య వివాహాలు నేరమని చేసుకున్నవారు, చేసే వారికి ఇరువురికీ జైలుశిక్ష తప్పదని సీడీపీవో హెచ్చరించారు.