కడప

సభలతో భాష పరిపక్వం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్, ఏప్రిల్ 26: తెలుగుభాషకు ఎంతో గొప్పతనం ఉందనీ, అయితే ఇప్పుడు చాలా తెలుగుపదాలు మరుగున పడిపోతున్నాయనీ తెలంగాణ రాష్ట్ర అకాడమి అధ్యక్షులు నందిని సిద్దారెడ్డి అన్నారు. కవి సమ్మేళనాలు, సాహిత్యసభలతో మాత్రమే భాష పరిపక్వం కాదని, అయితే అవి అవసరమని ఆయన అన్నారు. గురువారం స్థానిక హరిత టూరిజం హోటల్ ఫంక్షన్ హాల్‌లో ఏపీ సాంస్కృతికశాఖ, తెలుగు కళావేదికలు సంయుక్తంగా నిర్వహించిన ద్విశత కవిసమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో అనేక కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తాయని, వాటికి ఆయా భాషలలో పదాల సృష్టి జరగాలని , లేదా వాటిని ఆయా మాతృభాషలు సొంతంచేసుకునే విధంగా మార్చుకోవాలని ఆయన అన్నారు. ఒకప్పుడు తెలుగుభాష అభివృద్ధికి యూనివర్సిటీలు, అకాడమీలు కృషి చేసేవని అన్నారు. ఇప్పుడు యూనివర్సిటీలు ఆ పనిచేయడం మానుకున్నాయన్నారు. అకాడమీల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపి వాటిని అటకెక్కించాయన్నారు. ఈ పరిస్థితి పోవాలన్నారు. అప్పుడే భాష నిలబడుతుందని ఆయన అన్నారు. ఆంగ్ల భాషలో విద్యాభ్యాసం చేస్తేనే ఉద్యోగం లభిస్తుందన్నది అపోహమాత్రమేనని ఆయన అన్నారు. 200 మందితో కవిసమ్మేళనం ఏర్పాటుచేయడం గొప్పవిశేషమని అన్నారు.

గ్రామీణ ఉపాధిపనులు ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
* వడదెబ్బ తగలకుండా నివారణ చర్యలు తీసుకోండి * కలెక్టర్ బాబూరావునాయుడు
చెన్నూరు, ఏప్రిల్ 26: చెన్నూరు మండలం రాచినాయపల్లె గ్రామంలో జరుగుతున్న గ్రామీణ ఉపాధిపనులను పరిశీలించేందుకు గురువారం కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి పనులు జరుగుతున్న తీరుతెన్నులు పరిశీలించారు. ఉపాధి పనులకోసం వచ్చిన చిన్నపిల్లల తల్లిదండ్రులతో ముచ్చటించారు. పిల్లలపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఉపాధికూలీలకు సూచించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉపాధి పనులు నిర్వహిస్తున్నచోట వాటర్ ప్యాకెట్లు, మజ్జిగప్యాకెట్లు కూలీలకు అందించాలని ఉపాధి అధికారులను ఆదేశించారు. అలాగే ఎండలు ఉద్రితి దృష్ట్యా ఉదయం 6:30గంటలకే కూలి పనులు చేయించుకుని 10:30గంటలకు కూలీలను వదిలివేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిపనులు జరుగుతున్నచోట్ల చెట్లులేని పక్షంలో గుడారాలు ఏర్పాటుచేయాలని కోరారు. ఉపాదికూలీలను తీసుకొచ్చే వాహనాలు కూడా ఏర్పాటుచేసుకోవాలని అధికారులకు సూచించారు. ఉపాధిహామీ పనులు సక్రమంగా నిర్వహిస్తూ కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.