కడప

మండలి ఎన్నికలను తలపిస్తున్న బార్ అసోసియేషన్ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 26: జిల్లాకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు, స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలను తలపిస్తున్నాయి. శాసన మండలి ఎన్నికల్లోవలనే ఓటర్లను వివిధ రకాలుగా ప్రలోభపెట్టడం, క్యాంపులు నిర్వహించడం, వాహనాల్లో తీసుకొచ్చి ఓట్లు వేయించుకునే స్థాయికి ఎగబాకాయి. అందరూ ఉన్నత చదువులు చదివిన న్యాయవాదులే అయినా, సాధారణ ఓటర్లకన్నా తాము ఉన్నతమైన వాళ్లమేమీ కాదనిపించేలా ఈ ఎన్నికల వ్యవహారం నడుస్తోంది. గత మూడురోజులుగా, జిల్లాకోర్టు బార్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్న లాయర్లందరికీ ఘనంగా విందులు ఏర్పాటుచేస్తున్నారు. గుంపులో చేరేందుకు మొహమాటపడే కొంతమందికి విడివిడిగా విందుకు తగిన ఖర్చును వారి జేబుల్లో పెడుతున్నారు. రెండు మూడురోజులుగా ఈ విందులు ముమ్మరం కాగా, చివరిరోజైన గురువారం క్యాంపుల ఏర్పాట్లు కూడా జరిగాయి. గురువారం తమకు అనుకూలమైన న్యాయవాదులను, పోటీచేస్తున్న అభ్యర్థులు ఒకటి లేదా రెండు గుంపులుగా వివిధ అధునాతన హోటళ్లలో, కల్యాణ మండపాల్లో బస చేయించారు. శుక్రవారం జరగబోయే ఎన్నికలకు వీరిని ఈ క్యాంపుల నుంచే వాహనాల్లో తీసుకుపోయి ఓట్లు వేయించుకునే వ్యూహంలో అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల వాతావరణం, సాధారణ ఎన్నికల వాతావరణాన్ని మించిపోతోంది. ఈ హంగు ఆర్భాటాలు, విందు, క్యాంపు రాజకీయాలు గమనించిన పోలీసుశాఖ కూడా అప్రమత్తమైంది. ఎన్నికలకు శుక్రవారం కోర్టుబయట, కోర్టు ఆవరణంలో భారీ బందోబస్తును ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం.
బరిలో ఉన్నది వీరే
శుక్రవారం జరగబోయే జిల్లాకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జి.వి.రాఘవరెడ్డి, పి.సుబ్రమణ్యంలు అధ్యక్ష అభ్యర్థులుగా తలపడుతున్నారు. ప్రధానకార్యదర్శి పదవికోసం ఐదుగురు బరిలో ఉన్నారు. బి.ఆనంద్‌కుమార్, జివి సుబ్రమణ్యం, కె.అరుణకుమారి, ఎల్.శివశంకర్‌రెడ్డి, వై.రామగంగిరెడ్డిలు ప్రధాన కార్యదర్శి కోసం పోటీపడుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ పదవికోసం కె.శ్రీనివాసులు, వి.రాజగోపాల్‌రెడ్డిలు బరిలో నిలిచారు. కార్యదర్శి-1 పదవికోసం వరప్రసాద్, మహబూబ్‌పీరా తలపడుతున్నారు. కాగా కడప బార్ అసోసియేషన్‌లో 589 మంది సభ్యులుగా నమోదై ఉన్నారు. ఈ సభ్యులందరికీ ఓటువేసే హక్కు ఉంది. దాదాపు వీరందరితోనూ ఓటు వేయించుకునేందుకు అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు ఇరువురు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. తమ వెనుకవుండి బలపరుస్తున్న రాజకీయపార్టీల తోడ్పాటును కూడా వీరు ఉపయోగించుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు జరిగే బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల అధికారి ఎన్.రవీంద్రనాధరెడ్డి ప్రకటించారు.
ఏకగ్రీవ అభ్యర్థులు
ఇదిలా ఉంటే నాలుగు స్థానాలకు పోటీలేకుండా ఎన్నిక ఏకగ్రీవమైంది. మహిళ కార్యదర్శిగా ఏ.ఉమాదేవి, కోశాధికారిగా పి.చంద్రమోహన్, లైబ్రేరియన్‌గా కెనడి, కార్యదర్శి-2 పదవికి ఎంవి సుబ్బరామయ్యలు పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ఎన్.రవీంద్రనాధరెడ్డి ప్రకటించారు. వీరికి డిక్లరేషన్ ఇవ్వడం లాంఛనమే.