కడప

ఆదరణ పథకం కింద జిల్లాకు 10 వేల యూనిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 21: కులవృత్తులు నశించిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులవృత్తుల వారిని ప్రోత్సహించి వారిని ఆర్థికంగా, సామాజికంగా ప్రగతిపథంలో నడిపేందుకు ఆదరణ పథకం చేపట్టిందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం కడపలోని మునిసిపల్ స్టేడియంలో రెండో విడత ఆదరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ కులాల వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో 2.50 లక్షల మందికి ఆదరణ పనిముట్లు అందించేందుకు ప్రతిపాదించారని పది వేల యూనిట్ల కింద రూ.750 కోట్లు ఆదరణ పనిముట్లను అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గత పది సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఆదరణ పథకాన్ని చేపట్టారని తెలిపారు. జిల్లాకు 10 వేల యూనిట్లు అదనంగా మంజూరు చేయించేందుకు తాము మంత్రి అచ్చెన్నాయుడుతో మాట్లాడి ఈ యూనిట్లను మంజూరు చేయిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 125 చేతివృత్తుల వారు ఉన్నారని, వీరందరినీ ఆదుకోవడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఆదరణ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. బీసీలే తెలుగుదేశం పార్టీకి కొండంత అండ అని, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించినపుడు ఎన్‌టి రామారావు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, ఆర్థిక ప్రగతి చైతన్యం వంటి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. చంద్రన్నబీమా పథకం కింద అన్ని వర్గాల వారికి ఆదుకునేందుకు ఏకంగా ప్రీమియం కిందనే రూ.300కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఈ పథకం దేశంలో ఎక్కడా లేదని వెల్లడించారు. మరోవైపు ఈ యేడాది 3 లక్షల మంది కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నారని, ఇందులో బడుగు, బలహీనవర్గాల వారే అధికంగా ఉన్నారన్నారు. అలాగే నిరుద్యోగులను ఆదుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల మంది నిరుద్యోగులకు రకరకాల రుణాలు మంజూరు చేశామన్నారు. అలాగే మైనార్టీలు, ఎస్సీలకు మాత్రమే ఉన్న వివాహ ఆదరణ పథకం ఇపుడు అందరికీ అవకాశం కల్పించి పెళ్ళిళ్లకు ఆర్థికసాయం చేస్తున్నామని తెలిపారు. బీసీలంతా ఆదరించడం వల్లే రాష్ట్రంలోని తామంతా మంత్రులుగా ఉన్నామని వెల్లడించారు. కనుక పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆధునాతన పనిముట్ల ద్వారా కులవృత్తులలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలు మరింత ప్రగతి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వ్యవసాయ శాఖా మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ అన్ని కులాల కంటే రజకులే అతి పేదరికం అనుభవిస్తున్నారని అలాంటి వారికి ప్రస్తుతం ఇస్తున్న యూనిట్లు మరింత పెంచాలని వీరంతా గ్రూపులుగా ఏర్పడి అధునాతన పనిముట్లను ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాకు వచ్చిన 10 వేల యూనిట్లే కాకుండా అధికంగా మరో 10 వేల యూనిట్లు మంజూరు చేయాలని తాను ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి విన్నవించినట్లు వెల్లడించారు. బీసీల కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌నాయుడు మాట్లాడుతూ బీసీలంటే ఆదరించి వారిని అక్కున చేర్చుకున్నది దివంగత ముఖ్యమంత్రి రామరావు తరువాత చంద్రబాబునాయుడేనని, ఇపుడు బీసీల కోసం ఏకంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకాన్ని అన్ని వర్గాల వారు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ దళారులకు అవకాశం ఇవ్వకుండా బీసీలు తమకు వచ్చిన పథకాలను వినియోగించుకోవాలన్నారు. మండల స్థాయిలో వారి వారి పరిధిలో ఉన్న మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకొని ఏవైనా ఉంటే ఇబ్బందులు ఉంటే నేరుగా అధికారులను కలిసి ఫిర్యాదులు చేయాలన్నారు. రూ.30 వేలు యూనిట్ కింద రూ.3 వేలు లబ్దిదారుడు చెల్లిస్తే మిగతా మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. గ్రూపుల కింద యూనిట్లు పెట్టుకొని పెద్ద ఎత్తున ఈ పరికరాలను ఉపయోగించుకోవాలని అన్ని వర్గాలకు సూచించారు. ఈ సమావేశంలో వడ్డెర్ల సంక్షేమ ఛైర్మన్ దేవర మురళి, శాలివాహన సంఘం డైరెక్టర్ నాగేంద్ర, నారుూబ్రాహ్మణ డైరెక్టర్ ద్వారకనాధ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్ పరిరక్షణలో కార్యక్రమం సాగింది.

రాబోయేది రాజన్న రాజ్యమే
రాయచోటి, మే 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు అండదండలతో అత్యధిక మెజార్టీతో గెలిపించి రాజన్న సువర్ణ యుగాన్ని జగనన్న తిరిగి తీసుకువస్తాడని రాయచోటి నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్లు దాటిన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయనకు సంఘీభావంగా పాదయాత్రలతో ఆళ్లగడ్డ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ గంగుల జితేంద్రరెడ్డి(నాని)తో కలిసి తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో జగనన్న నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని తెలిపారు. ప్రజల కష్టాలను 2004 ఎన్నికల ముందు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తరువాత సువర్ణపాలన అందించారని తెలిపారు. ఇపుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారని తప్పకుండా 2019 ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాంప్రసాద్‌రెడ్డి తెలియజేశారు.