కడప

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 21: నిజాయితీ, నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ బాబూజీఅట్టాడా ఆకాంక్షించారు. సోమవారం నగర శివార్లలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో ఇటీవల శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాలో కొత్తగా విధుల్లో చేరబోతున్న 80 మంది పోలీసు కానిస్టేబుళ్లకు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై 15 రోజుల పాటు ప్రాధమిక అంశాలపై నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నూతన కానిస్టేబుళ్లకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో నూతన కానిస్టేబుళ్లకు ప్రత్యేకమైన విధులను నిర్వహించే స్పెషల్ పార్టీ విధుల్లో భాగమైన కూంబింగ్ ఆపరేషన్స్, దాడులు నిర్వహించడం, వాహనాలను సీజ్ చేయడం తదితర అంశాలను ఇందులో వివరిస్తారని ఎస్పీ తెలిపారు. విలువైన ఎర్రచందనం కాపాడేందుకు మీ వంతు కృషి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఎర్రచందనం, కూంబింగ్ ఆపరేషన్స్, ఎర్రచందనం స్మగర్లను అరెస్టు చేయడం, అందులో అంతర్ రాష్ట్రీయ, అంతర్జాతీయ స్మగర్లను అరెస్టు చేసేటపుడు తీసుకోవాల్సిన మెలకువలను శిక్షణలో నేర్పుతారని, ఏకాగ్రతతో నేర్చుకొని రాణించాలని సూచించారు. మరో 30 నుండి 35 సంవత్సరాల వరకు పోలీసు శాఖకు సేవలందించే మీరంతా మూడు అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. మొదటిది మీ ఆరోగ్యంపై దృష్టి సారించాలని, క్రమం తప్పక వ్యాయామం చేస్తూ చురుకుగా ఉంచుకోవాలన్నారు. శరీరం చురుకుగా ఉన్నపుడే విధులను సమర్థవంతంగా నిర్వహించగలమని ఎస్పీ తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని సూచించారు. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, ప్రజలకు చేరువై సేవాభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. 15 రోజుల శిక్షణను ఇష్టపడి, చెమటోడ్చి విజయవంతంగా పూర్తి చేసుకొని కడప జిల్లాలో ఉన్న అత్యంత విలువైన ఎర్రచందనం పరిరక్షణకు మీ వంతు కృషి చేసి భావి విజయాలకు పునాది వేసుకోవాలని ఎస్పీ బాబూజీఅట్టాడా దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ( ఆపరేషన్స్) అద్నాన్ నరుూం అస్మి, ఫ్యాక్షన్ జోన్ డీ ఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐ నాగభూషణం, డీటీసీ ఇన్‌స్పెక్టర్ శ్రీరాములు, ఆర్‌ఎస్‌ఐ లింగాధర్ తదితరులు పాల్గొన్నారు.