కడప

రోజురోజుకు ముంచుకొస్తున్న పెట్రోల్,డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 22: ఉపద్రవంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏరోజుకారోజు ముంచుకొస్తున్నాయి. తన్నుకు వస్తున్న వీటి ధరలతో సామాన్య, మద్యతరగతి వాహనదారులు బెంబేలెత్తేపరిస్థితి ఏర్పడింది. ఏరోజుకారోజు ఎంత పెరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. తాజాగా మంగళవారం నాటికి లీటరు పెట్రోల్ ధర రూ.82.35పైసలు వరకు పెరగగా, డీజిల్ ధర కూడా లీటరు రూ.74.65పైసలు వంతున పెరిగింది. కాగా పెట్రోల్‌పై రూ.36పైసలు, డీజిల్‌పై రూ.22పైసలు మంగళవారం నాటికి పెరిగింది. దీంతో వినియోగదారులు కలవరపడుతున్నారు. ఈ రీతిన చూసుకుంటే ఈనెల చివరినాటికి పెట్రోల్ ధర లీటరు రూ.100లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని పెట్రోల్ బంకుల యజమానులే స్పష్టం చేస్తున్నారు. వీటి ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోజువారి ధరల క్రమంలో గత రెండునెలలుగా లీటరుకు పెట్రోల్, డీజిల్‌పై రూ.10లు పెరిగింది. ప్రస్తుతం జీవనయానంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌నుబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు నిర్ణయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా ఏరోజు ఏమేరకు పెరుగుతాయో అంతుపట్టని పరిస్థితి కొనసాగుతోంది. గత కాంగ్రెస్ హయాంలో రూ.60లు నుండి రూ.70లు వరకు పెరగడంతో ఆ ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ కేంద్రప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలో కాస్తోకూస్తో తగ్గించినా, ఆ తర్వాత వీటి ధరలు ఏనెలకు ఆనెల పెరుగుతూనే వస్తున్నాయి. ఈనెల మార్చి నాటికి పెట్రోల్ ధర రూ.70లు ఉండేది. కానీ ఈనెల 15వ తేదీ నాటికి ఈ ధర రూ.80.37పైసలు ఉండగా, తాజాగా మంగళవారం నాటికి రూ.84లకు పెరిగింది. రాత్రికి రాత్రే ధరలు ఖరారుచేసే అవకాశం ఉంది కాబట్టి, పెట్రోల్, డీజిల్ ధరలపై ఎంతపెరుగుతాయో పెట్రోల్ బంకు యాజమాన్యాలు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 241 పెట్రోల్ , డీజిల్ బంకులు ఉన్నాయి. జిల్లాలో రోజుకు 3లక్షల 25వేల లీటర్ల పెట్రోలు, 10లక్షల 50వేల మీటర్ల డీజిల్ వినియోగవౌతోంది. పెట్రోల్ ధరలపై రూ.40లక్షలు, డీజిల్ ధరలపై రూ.కోటి 20లక్షలు వంతున అదనపుభారం పడుతోంది. ఇలా రోజురోజుకు డీజిల్,పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా నిత్యావసర సరుకులు, పాలు, ఇతరత్రా వస్తువులు తరలించే లారీలు, ఇతర వాహనదారులు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆటోవారు తీవ్రస్థాయిలో కలవరపాటు చెందుతున్నారు. ఇక ఆర్టీసీకి భారం అంతా ఇంతాకాదు. ఈ భారం ఎంతమేరకు నష్టాలను తీసుకువస్తుందో అర్థంగాక అధికారులు అయోమయం చెందుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కోట్లరూపాయల నష్టాల్లో కొనసాగుతోంది. నిరంతర ధరల పెరుగుదల వల్ల ఆర్టీసీ యాజమాన్యం నష్టాన్ని పూడ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ చార్జిలు పెంచలేకపోవడం, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో యాజమాన్యం ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం కూడా ఆర్టీసీకి బస్సుచార్జిలు పెంచుకునే అవకాశాలు కల్పించకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో అధికారులు సతమతవౌతున్నారు. ఇందులో కడప నుండి అటు విజయవాడ, ఇటు హైదరాబాద్‌కు వెళ్లే ప్రైవేట్ వాహనదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. వాహనాల మద్య ఉన్న పోటీతత్వంతో చార్జిలు పెంచితే తమ వాహనాలకు ఇబ్బందులు ఎదురౌతాయని భావిస్తూ ఎవరికివారు ఆందోళన చెందుతున్నారు. ఈనెల చివరినాటికి డీజిల్, పెట్రోల్ ధరలు ఊహించని విధంగా భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయని ,కేంద్ర అధికారులే చెబుతుండటంతో వాహనదారులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.