కడప

జిల్లాలో మినీ మహానాడు విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,మే 22: జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన మినీమహానాడు సభలు విజయవంతమయ్యాయని, అందుకు తాను కార్యకర్తలకు ,ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంగళవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్ల నుండి జిల్లా అభివృద్ధిపై కావాల్సిన మేరకు దృష్టిసారించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. వాటన్నింటిపై ప్రస్తుతం జరిగిన మినీమహానాడులో సమీక్ష చేసుకున్నామని, జిల్లాలో ఇక జరగాల్సిన ప్రగతిపై కూడా పలు తీర్మానాలు చేశామన్నారు. గత పదిరోజుల నుంచి సమాచారలోపాలతో చిన్న చిన్న సమస్యలు, మనస్పర్థలు పార్టీలో వచ్చాయని, అయితే ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి వాటన్నింటిని సర్దుబాటు చేశారన్నారు. ఇకపై ఐక్యమత్యంగా పోరాడటమే మా లక్ష్యమని , జిల్లాలోని 10స్థానాలు తప్పకుండా గెలుస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మాకు శిరోధార్యమని, ఇకపై మా నేతలెవరూ పత్రికలకు ఎక్కమని తేల్చిచెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలోని ప్రతి పేదవాడికి అందేలా కృషి చేస్తామన్నారు. ఈనెల 27,28,29వ తేదీల్లో అమరావతిలో రాష్టమ్రహానాడు జరగనుందని, అందులో జిల్లాలోని క్రీయాశీల సభ్యులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పులివెందులలో నిర్వహించిన జిల్లా మహానాడులో తీసుకున్న పలు తీర్మానాల కాపీని ఆయన విడుదల చేశారు. అందులో ముఖ్యంగా జిల్లాలో ఉక్కుకర్మాగారం రాబట్టుకునే ప్రయత్నం , కొప్పర్తి గ్రామపంచాయతీలోని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా సేకరించిన 6వేల ఎకరాల భూమిలో పరిశ్రమల స్థాపన, పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో ఉన్న యురేనియం ప్రాజెక్టువల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లింపు, రేడియేషన్ ప్రభావం వల్ల పంటలు నష్టపోవడం, కలుషితమైన నీటి వల్ల ప్రజలు, జంతువులు సైతం ఇబ్బందులు పడటం లాంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సురక్షితమైన మంచినీటిని అందించే ప్రయత్నం , తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా ముస్లిం, హిందు దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు నిధులు కేటాయించిన విధంగా క్రిస్టియన్ సంస్థల్లో పనిచేస్తున్న ఫాస్టర్లకు కూడా నెలసరి వేతనాలు కోరడం, కడప -బెంగుళూరు రైల్వేలైన్ పనులు వేగవంతం, గాలేరు-నగరి,సుజల స్రవంతి ప్రాజెక్టురెండవ దశ పూర్తికి కృషి చేసే నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

నానాటికి తీసికట్టు- చదవడం గట్టునపెట్టు
* దూర విద్యపరీక్షలు ఓ ప్రహసనం
* డబ్బుంటే అక్షరముక్క రాకపోయినా సర్ట్ఫికెట్ * చూచిరాతల మయమైన దూరవిద్య

కడప,మే 22: ఆచార్యనాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో దూరవిద్యపరీక్షలు చూసి రాతలుగా మారాయి. యూనివర్సిటీ పరిధిలో దూర విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 20నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్ర, తెలంగాణలోని పలు కళాశాలలను, యూనివర్సిటీ అధికారులు పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. అయితే పరీక్ష కేంద్రాలుగా ప్రొద్దుటూరు, కడప లాంటి పట్టణాల్లో ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయకుండా, మారుమూల మండలాల్లో ఉన్న ప్రైవేట్ కళాశాలలను ఎంపిక చేయడంలోనే, యూనివర్సిటీ అధికారుల లాలూచీ వ్యవహారం బట్టబయలవుతోంది. జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన వేదవ్యాస డిగ్రీ కళాశాలను స్టడీ సెంటర్‌గా మంజూరుచేసిన యూనివర్సిటీ అధికారులు, పరీక్ష కేంద్రాన్ని మాత్రం ప్రొద్దుటూరులోని ప్రభుత్వ కళాశాలలను కాకుండా, ఎక్కడో ముద్దనూరులో ఉన్న ప్రైవేట్ కాలేజిని ఎంపికచేశారు. పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేయడంలోనే , అన్ని అక్రమ మార్గాలకు అవకాశం ఉండేలా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ముద్దనూరులోని శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలను పరీక్షా కేంద్రంగా కేటాయించడంతో, అధికారుల నిఘా కొరవడి స్టడీ సెంటర్ నిర్వాహకుల ఆడిందే ఆటగా పాడిందే పాటగా పరీక్షలు జరుగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. నిజాయితీగా చదివిన విద్యార్థులు కుమిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవర్గపు విద్యార్థులు వాపోతున్నారు. డబ్బు వెదజల్లిన వారికి ఇక్కడ దూర విద్యపరీక్షలు చూచి రాతలుగా మారిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాసేందుకు జిల్లాలోని నలుమూలల కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి పరీక్షలు రాస్తున్నారు. ఇతర జిల్లాల విద్యార్థులు కూడా ఈస్టడీ సెంటర్ నుంచి పరీక్షలు రాసేందుకు ఉత్సాహ పడుతున్నారంటే , ఇక్కడ సర్ట్ఫికెట్ గ్యారంటీ అనే హామీ దొరకడమేనని ప్రచారం జరుగుతోంది. ఈ దూర పరీక్షల్లో కాపీలు జరిపించేందుకు ముద్దనూరులోని పరీక్ష కేంద్రం యాజమాన్యానికి కొంత మొత్తం ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకుగాను ప్రొద్దుటూరు స్టడీ సెంటర్ నిర్వాహకులు ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.3వేల నుంచి రూ.4 వేలు వరకు వసూళ్లు చేస్తున్నట్లు, కొందరు విద్యార్థులు ఆంధ్రభూమికి తెలిపారు. అంతేగాకుండా అధికమొత్తం ఇచ్చిన విద్యార్థుల స్థానంలో మరో తెలివైన వారిని డమీగా కూర్చొబెట్టి పరీక్షలు రాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి విద్యార్థుల నుంచి రూ.8వేలు నుంచి రూ.10వేలు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ పరీక్షల వ్యవహారం వల్ల, నిజాయితీగా చదివి పరీక్షలు రాసే పేద విద్యార్థులు నష్టపోతున్నారు. సర్ట్ఫికెట్లకోసం డబ్బు వెచ్చించేవారే కుహన విద్యావేత్తలుగా బయటకు వస్తున్నారు.
అధికారుల కుమ్మక్కువల్లే ఇదంతా
కడప, ప్రొద్దుటూరు లాంటి పట్టణాల్లో ప్రభుత్వ కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా ఎంపికచేస్తే కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య, నిఘాతో పరీక్షలు జరుగుతాయి. అయితే యూనివర్సిటీ అధికారులు, విద్యాశాఖ అధికారులు స్టడీ సెంటర్ నిర్వాహకులతో కుమ్మక్కై తమ వాటా తాము జేబులోవేసుకుని వారికి కావాల్సిన కాలేజిని పరీక్ష కేంద్రంగా ఎంపికచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో స్టడీ సెంటర్ ఉండగా, 30కి.మీ.దూరంలో మారుమూల ఉన్న ముద్దనూరులోని ప్రైవేట్ కాలేజిని కేంద్రంగా ఎంపికచేయడమే ఇందుకు నిదర్శనం.