కడప

రైతుల పంటల బీమాను అందరికీ అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 24: పంటల బీమాకింద జిల్లాకు రావాల్సిన మొత్తాన్ని అందేవిధంగా చేయాలని ఇందుకోసం జిల్లాఅధికారులు దృష్టిపెట్టాలని ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు కలెక్టర్ హరికిరణ్ దృష్టికి తీసుకొచ్చారు. జడ్పీలో జరిగిన సమావేశంలో వ్యవసాయశాఖకు సంబంధించిన సమీక్షలో కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత యేడాది 2500 మంది రైతులకు పంట పరిహారం దక్కలేదని, ఇందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని దీనిపై సమగ్రవిచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలన్నారు. పంట రుణాలకు సంబంధించి రైతులు చేస్తున్న దరఖాస్తుల పరిశీలనలో వెలుగు అధికారులు సక్రమంగా సరిదిద్దకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పంటల బీమా కట్టించుకున్నా, ఐసిఐసి బ్యాంకు వారు ఇప్పుడు ఏమాత్రం చొరవచూపకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఒక ప్రాంతంలోని బొల్లవరంలో 1100 ఎకరాల్లో శెనగ పంట వేస్తే కేవలం 250 ఎకరాలు మాత్రమే పంటసాగుచేసినట్లు అధికారులు నివేదించారన్నారు. ఫలితంగా కేవలం 250మంది రైతులకు రూ.30లక్షలు మాత్రమే పరిహారం మంజూరైందని, ఒక్కొక్క రైతుకు రూ.5వేలు నుంచి రూ.10వేలు వంతున చెల్లించారని, ఈప్రాంతంలో ఎకరాకు రూ.16వేలు పరిహారం రావాల్సివుండగా అందలేదన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి జోక్యం చేసుకుంటూ 2013-14సంవత్సరంలో కూడా జిల్లా వ్యాప్తంగా 25వేల మంది రైతులకు పంట పరిహారం దక్కలేదని, ప్రభుత్వం తాము చెల్లించాల్సిన రూ.30కోట్లు ప్రీమియం చెల్లిస్తే జిల్లాకు రూ.169కోట్లు పరిహారం వచ్చే అవకాశం ఉందని, దీనిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయశాఖ జేడీ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2.5లక్షల మందికి రూ.1285కోట్లు మంజూరైందని, ఇప్పటి వరకు మూడు విడతలుగా రైతులకు ఈపరిహారం అందజేస్తున్నామని , మూడవ విడతగా మరో రూ.20కోట్లు రావాల్సివుందన్నారు. గతంలో ఈ పంట పరిహారం మంజూరులో జరిగిన ఇబ్బందులపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. సింహాద్రిపురం జెడ్పిటిసి పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పరిహారం మంజూరులో కంపెనీలు సమర్థవంతంగా వ్యవహరించడంలేదని, ఇటీవల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే రైతులుతీసుకునే పంట రుణాలపై పలు బ్యాంకులు రూ.10వేలు వంతున ఇన్సురెన్స్ వసూళ్లు చేస్తున్నాయని, ఇది చట్టవిరుద్ధమని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కలుగచేసుకుంటూ రైతులకు అందాల్సిన పరిహారం మంజూరు చేసే విధంగా అధికారులు దృష్టిపెట్టాలన్నారు.
ఎక్కడ తాగునీటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కారమార్గం
* ప్రత్యేక సెల్ ఏర్పాటుచేశాం : కలెక్టర్
జిల్లాలో ఈ వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేకసెల్ ఏర్పాటుచేశామని, ఎవరైనా ఎప్పుడైనా ఈసెల్‌ను సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, ఇందుకు సంబంధించి ప్రతిరోజు తాను సమీక్షిస్తున్నానని కలెక్టర్ హరికిరణ్ వెల్లడించారు. గతంలో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశామని, అయితే కృష్ణాజలాలు కడప జిల్లాకు పెద్దఎత్తున తరలించుకురావడం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా పెరిగాయన్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి పైడిపాలెం, పులివెందుల ప్రాంతంతోపాటు బ్రహ్మంగారిమఠం, ఇతర ప్రాంతాల్లో నీరు సమృద్దిగా ఉందని, అందువల్లే ఇప్పుడు కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే తాగునీటికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. తాను రాయలసీమలోని మిగతా మూడు జిల్లాల్లో పనిచేశానని, ఇక్కడకు రావడంవల్ల ఈప్రాంతాలపై ఒక అవగాహన కలిగిందన్నారు. ప్రతి రైతు, ప్రతిరోజు తమకు వచ్చే ఆదాయంపై చర్చించుకునే పరిస్థితి రావాలని, ఇందుకు అనేక మార్గాలు అనే్వషిస్తున్నామన్నారు. ఉద్యానవనం విస్తరింపచేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 790 గ్రామపంచాయతీలు ఉండగా 65 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామం ముంగిట్లో ఎరువు దిబ్బలు అధికంగా కన్పిస్తున్నాయని , వీటిని నిర్మూలించి ఆ ప్రాంతరూపురేఖలు మార్చేవిధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. కాగా జిల్లాలో రైతులు మోటార్లు బిగించుకునేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తుచేసుకుంటున్నా వాటికి సంబంధించిన దరఖాస్తులు తీసుకోవడంలేదని పలువురు సభ్యులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై ట్రాన్స్‌కో ఎస్‌ఇ మాట్లాడుతూ గత ఏడాది 7500మోటార్లు బిగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని, అవి పూర్తయితేకాని కొత్తవి ఇవ్వలేమన్నారు. విప్ మేడా మల్లికార్జునరెడ్డి జోక్యం చేసుకుంటూ ఇటీవల ముఖ్యమంత్రి కడపకు వచ్చినప్పుడు జిల్లాలో మోటార్లకోసం వచ్చిన దరఖాస్తుల వ్యవహారంపై ఆయన దృష్టికి తేగా సదరన్ అధికారులను పిలిపించి మొత్తం దరఖాస్తు చేసుకున్నవారందరికీ కనెక్షన్లు ఇవ్వాలని ఆయన ఆదేశించారని తెలిపారు. ఈసమావేశానికి జిల్లా పరిషత్ సీఇవో రామచంద్రారెడ్డి కార్యనిర్వాహణ చేశారు.