కడప

స్టేట్ బార్‌కౌన్సిల్ నామినేషన్లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప లీగల్, మే 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల బార్ కౌన్సిల్ నామినేషన్ పర్వం ప్రారంభమైందని, ఈనెల 27న నామినేషన్‌కు తుదిగడువుగా నిర్ణయించారు. ఎన్నికలు జూన్ 29న జరుగుతుందని, ఆమేరకు కడప బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఆనంద్‌కుమార్ తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు, అలాగే స్టేట్ బార్‌కౌన్సిల్ సభ్యులుగా వీరు 25మందిని ఎన్నుకుంటారని, కాగా ఎన్నికల బరిలో దాదాపు 1300 మంది న్యాయవాదులు నామినేషన్ వేస్తున్నారని, ఈ ఎన్నికలు ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌వారు తెలిపారని, అలాగే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, అవి విడిగా నిర్వహించుకుంటారని తెలిపారు. కాగా ఈ ఎన్నికల బరిలో కడప జిల్లాకు చెందిన న్యాయవాదులు టి.నాగరాజు, ఎం.వెంకటేశ్వరరెడ్డి, హైకోర్టులో ప్రాక్టీస్‌చేస్తున్న రాయచోటి నివాసి కొవ్వూరు వెంకటరామిరెడ్డిలు నామినేషన్లువేసినట్లు తెలిసింది. ఈనెల 27వ తేదిన నామినేషన్ గట్టం ముగిసి, అలాగే స్కూృట్ని, విత్‌డ్రాలు 29న నిర్వహిస్తారన్నారు. 31న బరిలో ఉన్న అభ్యర్థులకు కోడ్‌నెంబర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు 13 జిల్లాలకు సుడిగాలి పర్యటన ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు.