కడప

రోడ్డుప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,మే 26:రోడ్డుప్రమాదాలు నివారించేందుకు రోడ్డురవాణా సంస్థ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ బంగ్లాలోని ఆయన చాంబర్‌లో రోడ్డ్భుద్రత ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లాలో ద్విచక్రవాహనదారుల రోడ్డుప్రమాదాలు మరింత పెరిగాయని, వాటి నివారణకు శాఖాపరమైన చర్యలు రోడ్డురవాణా సంస్థ చేపట్టాలని తెలిపారు. డ్రైవింగ్ లేకుండా వాహనాలు నడిపేచోదకులకు అవగాహన కలిగించి, డ్రైవింగ్ లైసెన్సు పొందేలా సూచనలు అందజేయాలన్నారు. అలాగే జిల్లాలో అత్యధికంగా ఆటోలు రవాణా ఎక్కువ కావడంతో పొగకాలుష్యం ఎక్కువగా ఉందని, దీనివల్ల ప్రజలు అనేక రోగాలకు గురౌతున్నారన్నారు. దీర్ఘకాలికంగా పనిచేయని వాహనాలు, వాటి భద్రతకు పరీక్షించిన వాటిని మాత్రమే వాటికి అనుమతి ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే పాఠశాలలు, కాలేజిల బస్సులకు సంబంధించిన ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ప్రయాణాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని రవాణాశాఖ అధికారులు పాఠశాలలకు సంబంధించిన బస్సులు, కళాశాలలకు సంబంధించిన బస్సుల పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. ఎలాంటిలోపాలు ఉన్నా వాటి అనుమతి రద్దు చేయాలని, యాజమాన్యానికి తలొగ్గకుండా నిర్ణయాలు ప్రజలకు, విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని కలెక్టర్ హితవుపలికారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన, కళాశాలలకు సంబంధించిన బస్సులు నడిపే చోదకుల ఆరోగ్యపరిస్థితులు కూడా పర్యవేక్షించి వారికి డ్రైవింగ్ లైసెన్సు, కాలపరిమితి ఉన్నదీ లేనిదీ గమనించాల్సిన అవసరం రవాణాశాఖపై ఉందన్నారు. పోలీసుశాఖ, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో ప్రైవేట్‌వాహనాలపై, రోడ్డ్భుద్రత ప్రయాణాలపై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు అవసరమున్నచోట వేగనిరోధక స్పీడ్ బ్రేక్‌లు ఏర్పాటు చేయాలని, అలాగే రోడ్డుకు సమీపాన ఉన్న పాఠశాలల వద్ద, కళాశాలల వద్ద సూచికల బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రవాణాశాఖ అధికారి బసిరెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసుశాఖ అధికారులు, రెవెన్యూశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

ఎస్సీ,ఎస్టీల సమస్యలు పరిష్కరించాలి
కడప,మే 26: షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్దచూపాలని జిల్లాకలెక్టర్ సి.హరికిరణ్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని మీకోసం హాల్‌లో ఎస్సీ,ఎస్టీల కోసం ప్రత్యేక వినతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారని, జిల్లా అధికారులు బాధితుల సమస్యలను గుర్తించి వెంటనే సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఇందులో ఖాజీపేట మండలం నాగసానిపల్లె గ్రామంలో సిమెంట్ రోడ్డువేయాలని కోరారు. కడప పట్టణానికి చెందిన విడి శాంత రేషన్‌కార్డుకోసం అభ్యర్తించారు. సికెదినె్న మండలం ఇందిరానగర్‌కు చెందిన దేవభూషణ్, మరికొందరు తమ ప్రాంతంలో చర్చి నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని కోరారు. బి.మఠం మండలం రేకులకుంట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గ్రామవాసి ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు. దువ్వూరు మండలం చింతకుంటకు చెందిన ఓబులేసు తన తమ్ముడికి చంద్రన్న పెళ్లికానుక మంజూరు చేయాలని కోరారు. పుల్లంపేట మండలం లక్ష్మినారాయణ పురానికి విద్యుత్ సరఫరా చేయాలని కె.వెంకటసుబ్బయ్య అభ్యర్థించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఈశ్వరయ్య, డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డి, సీపీవో తిప్పేస్వామి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు సహాయ సంచాలకులు హనుమాన్ ప్రసాద్, ఎస్సీకార్పొరేషన్ ఇడి శ్రీలక్ష్మి, పశుసంవర్థకశాఖ జేడీ జయకుమార్, డీటీడబ్ల్యు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.