కడప

జన్మభూమిలో కొత్తరేషన్‌కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 28: జిల్లాలో చాలాఏళ్లుగా నిరుపేదలు రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తుండగా వచ్చేనెల 2 నుంచి ప్రారంభంకానున్న జన్మభూమి కార్యక్రమంలో 34వేల మందికి రేషన్‌కార్డులు అందనున్నాయి. గత పదేళ్లుగా కార్డులకోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే అప్పట్లో కొంతమందికి మాత్రమే తాత్కాలిక కూపన్లు ఇచ్చి రెండు మూడేళ్లు ఆ కూపన్ల ద్వారా రేషన్ ఇస్తూ వచ్చారు. జిల్లా మొత్తం 28 లక్షల 84వేల 524 మంది జనాభా ఉండగా, ప్రస్తుతం 6,99,672 కుటుంబాలు తెల్లరేషన్‌కార్డులు, అంత్యోదయ అన్నయోజన కార్డులు , అన్నపూర్ణ కార్డులు కలిగి ఉన్నారు. గత పదేళ్లుగా జిల్లావ్యాప్తంగా తెల్లకార్డుల కోసం 97 వేల 430మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో అనర్హులుగా 6 వేల 329 మందిని నిర్థారించారు. మిగిలిన 91వేల 124 దరఖాస్తులను సంబంధిత రెవెన్యూ అధికారులు కంప్యూటీకరణ చేశారు. అయితే 18 నెలల క్రితం ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వం మరోమారు ఈ రేషన్‌కార్డుల పంపిణీపై కసరత్తు ప్రారంభించింది. అధికారుల నిర్థారించిన వారిలో కూడా అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జన్మభూమి కార్యక్రమంలో 34వేల మందికి రేషన్‌కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వ చౌకదుకాణాల వారీగా జాబితాలను సిద్ధం చేశారు. ప్రస్తుతం 11వేల 854 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుండటంతో కొత్తకార్డులకు మరో 2వేల పైబడి మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించాల్సి ఉంది.
వైవియులో నాక్‌బృందం తనిఖీలు
ఆంధ్రభూమి బ్యూరో
కడప,డిసెంబర్ 28: దేశంలోని 5 విశ్వవిద్యాలయాలకు చెందిన అధికారుల నేతృత్వంలో కేంద్రప్రభుత్వం నియమించిన నాక్ బృందం సోమవారం యోగివేమన విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. నాక్ బృందానికి బ్రహ్మ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఏపి పాది చైర్మన్‌గా నేతృత్వం వహిస్తుండగా, డెహ్రాడూన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి విభాగాధిపతి ఆచార్యులు కులదీప్‌కుమార్ కన్వీనర్‌గాను, బెంగుళూరు యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు బిఎస్ శ్రీరామ్, గురునానక్ యూనివర్సిటీ అధిపతి ఆచార్య సంధు, కల్యాణి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అరవింద్‌కుమార్ దాసు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం సోమవారం వైవియును సందర్శించి సంతృప్తి వ్యక్తంచేసింది. మరో రెండురోజులపాటు నాక్ బృందం యూనివర్సిటీని తనిఖీ చేయనుంది. రాష్టవ్రిభజన అనంతరం తొలిసారిగా ఈ విశ్వవిద్యాలయాన్ని నాక్ బృందం సందర్శించింది. 2014 మేలో యోగివేమన విశ్వవిద్యాలయం అభివృద్ధికి నాక్ బృందం డాక్యుమెంట్లు సమర్పించింది. యూనివర్సిటీలో సోలార్ ప్రాజెక్టు భవనాన్ని పూర్తిచేసి, 10 ఎకరాల్లో మిడిల్ క్లాస్ ఆసుపత్రి నిర్మించి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోని 25 గ్రామాల ప్రజలకు సేవలు అందించనున్నారు. యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. తొలిరోజు సందర్శనలో నాక్ బృందం అన్ని విభాగాలు పరిశీలించి ప్రాంగణాన్ని కలియతిరుగుతూ వివిధ విభాగాధిపతులను సౌకర్యాలపై వాకబు చేశారు. మొత్తమీద వైవియులో సౌకర్యాలపై నాక్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బృందానికి వైవియు ఉపకులపతి ఆచార్య బి.శ్యాసుందర్ వివిధవిభాగాల పనితీరును వివరించారు. నాక్‌బృందం పరిశీలనతో యూనివర్సిటీకి జాతీయస్థాయి గుర్తింపు రాగలదని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు.