కడప

ఉక్కు వచ్చే వరకు పట్టువదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధం
* మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపి రమేష్‌నాయుడు
కడప, జూన్ 14: కేంద్రప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు 13వ షెడ్యూలు ప్రకారం కడప జిల్లాకు రావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని, అందుకోసం తెలుగుదేశంపార్టీ ఎలాంటి త్యాగాలకైనా సిద్దమని గురువారం మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌నాయుడు అన్నారు. నగరంలోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో సిఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన 18 అంశాల్లో కడప ఉక్కు ఒక అంశమని, దీనిపై తాను ఎన్నోసార్లు పార్లమెంట్‌లో చర్చ లేవదీశానన్నారు. చంద్రబాబునాయుడు పలుసార్లు కేంద్రానికి విన్నవించినా స్పందించలేదన్నారు. జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ కోసం ఎన్నో కమిటీలతో కేంద్రం సర్వేచేయించిందని, ముఖ్యంగా మెకాన్ కమిటీ జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ స్థాపనకు పరిస్థితులు అనుకూలిస్తాయని రిపోర్టు ఇచ్చిందని అన్నారు. ఆ నివేదికను పట్టించుకోకుండా ఉక్క్ఫ్యుక్టరీకి ఫీజబులిటీ లేదంటూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం ద్రోహం చేయడమేనన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం తెలుగుదేశంపార్టీ కడప జిల్లాలో కావాల్సినంత స్థలాన్ని ఇస్తుందని, కావాల్సిన నీటి సదుపాయం, ప్రహరీ సదుపాయం, ఫ్యాక్టరీ వ్యాపారంలో ఈక్విటీ సైతం తీసుకుంటామని ప్రకటించినా ఇంకా కేంద్రానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం స్వంతంగా కానీ, ప్రైవేట్ సహకారంతోకానీ ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ త్వరలోనే కడపకు ఉక్క్ఫ్యుక్టరీ ఇస్తామని ప్రకటించి మాటతప్పడం శోచనీయమన్నారు. తాము ఇన్ని పోరాటాలుచేస్తున్నా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కలిసిరావడం లేదంటూ ఆరోపించారు. దీనికోసం త్వరలోనే తాను నిరవధిక నిరాహారదీక్షకు కూర్చుంటున్నట్లు ప్రకటించారు. శుక్రవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి దాని నిర్ణయం మేరకు విధి విధానాలు, తేదీలు ప్రకటిస్తామన్నారు. ఈసమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో కూడా కడప ఉక్క్ఫ్యుక్టరీకి అవసరమైనవన్నీ సమకూరుస్తామని చెప్పినా, కేంద్రం నమ్మకద్రోహం చేస్తున్నట్లు ఏనాడో ప్రకటించారన్నారు. తెలంగాణ నాయకులు పి.సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో తమ రాష్ట్రానికి ఉక్క్ఫ్యుక్టరీ కావాలంటూ వేసిన పిల్‌కు కేంద్రం అఫిడవిట్ సమర్పిస్తూ తెలంగాణలో ఉక్క్ఫ్యుక్టరీ సాధ్యం కాదని అందువల్ల ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇవ్వడంలేదని ప్రకటించడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో దాదాపు 300 సంవత్సరాలకు సరిపడ ముడిసరుకు ఉందని, కేంద్రానికి నివేదికలు ఇచ్చినా ఇంకా అభ్యంతరం ఏమిటో తెలియడం లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, చంద్రబాబుకు మంచి పేరు రాకూడదన్నదే కేంద్రం ఉద్దేశ్యమని ఆయన ఆరోపించారు. ఎన్మోసార్లు స్థానిక బీజేపీ నేతలు త్వరలో ఫ్యాక్టరీ వస్తుందని, ప్రధాని చేతులమీదుగా ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరుగుతుందని ప్రకటించినా ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి ఖచ్చితమైన ప్రకటన వెలువడలేదన్నారు. జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీ సాధనకోసం తెలుగుదేశం పార్టీ పట్టు విడవకుండా కష్టపడుతోందన్నారు. విభజన చట్టంలో ఉక్కు అంశం ఉన్నప్పటికీ ఇప్పుడు అది సాధ్యం కాదని ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. నిన్నటి దినం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారన్నారు. శుక్రవారం ఆర్‌అండ్‌బిలో అఖిలపక్షం ఏర్పాటుచేసి తెలుగుదేశంపార్టీ తదనంతరం తీసుకునే కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

ముస్లింల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
* మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన విప్ మేడా
సుండుపల్లె, జూన్ 14: ముస్లింల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జీకే రాచపల్లె నందు రంజాన్ తోఫా పంపిణీలో భాగంగా మసీదు నందు ప్రత్యేక ప్రార్థనలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పుణ్యమాసం ముస్లిం సోదరులకు ముందస్తు ఈద్ ముబారక్ తెలియజేశారు. ముస్లింల అభివృద్ధే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక పేద కుటుంబం రంజాన్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఐదు రకాల వస్తువులను కానుకగా సీఎం అందజేయడం జరుగుతోందన్నారు. అలాగే హిందూ, ముస్లింల మిత్రబంధానికి ప్రతీకగా రంజాన్ పండుగ జరుపుకుంటారన్నారు. అందరూ కలిసిమెలిసి ఒక తాటిపైనడిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అమరావతి నిర్మాణంలో అలుపెరగని పోరాటంచేస్తూ ప్రతిఒక వర్గాన్ని న్యాయం చేస్తున్న ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. అలాగే రాబోవు రోజుల్లోను మరింతగా ప్రభుత్వ సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.