కడప

సైకిలెక్కే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న అహ్మదుల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 28: కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు, కడప మాజీ మున్సిపల్ చైర్మన్, రెండుపర్యాయాలు మంత్రిగా పనిచేసిన ఎస్‌ఎండి అహ్మదుల్లా గత కొంతకాలంగా కాంగ్రెస్‌పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు చేస్తున్నారు. ఆయన టిడిపిలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఒక ఎమ్మెల్యే వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు నెలరోజులుగా ప్రచారం జరుగుతోంది. వారం రోజులుగా ఆయన సైకిలెక్కడం తధ్యమని టిడిపిలో ఒక బలమైన వర్గం సమాచారం. ఆ ఎమ్మెల్యే టిడిపిలో చేరేది,లేనిది తెలుసుకున్న తర్వాతనే అహ్మదుల్లా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అహ్మదుల్లా ఎన్నికల బరిలో దిగలేదు. తన కుమారుడు అషఫ్‌న్రు తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైకాపా ఎమ్మెల్యే టిడిపిలో చేరతారని ప్రచారంతో వచ్చే ఎన్నికల్లో టిడిపి టికెట్ లభిస్తుందో, లేదోనని అనుచరులు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో మాజీ మంత్రి డాక్టర్ ఎస్‌ఏ ఖలీల్‌బాషా, మరికొంతమంది మైనార్టీ నాయకులు ఉన్నా పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు. టిడిపి , బిజెపి మిత్ర పక్షాలుకావడంతో ఎన్నికల పోలింగ్ సమీపించిన సమయంలో గత ఎన్నికల్లో కడపసీటును బిజెపికి కేటాయించారు. వైకాపా అభ్యర్థిచేతిలో ఓటమి చవిచూశారు. కడప నగరంలో మైనార్టీలు అధికంగా మైనార్టీ అభ్యర్థులవైపే సహజంగా పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. అయితే వైకాపా ఎమ్మెల్యే టిడిపిలో చేరతారన్న వార్తల నేపథ్యంలో అహ్మదుల్లా తాత్కాలికంగా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

వడదెబ్బతో ముగ్గురి మృతి
గోపవరం, ఏప్రిల్ 28: జిల్లాలో వడదెబ్బకు గురై గురువారం ముగ్గురు మృతిచెందారు. గోపవరం మండలంలోని లక్కవారిపల్లె గ్రామ దళితవాడకు చెందిన బద్దెల పెద్దచంటయ్య (45) గురువారం వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దచంటయ్య ఉదయం పొలంలో పని నిమిత్తమై వెళ్లగా అక్కడ ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురై ఇంటికి చేరుకున్నాడు. వడదెబ్బకు గురై మృత్యువాతపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
వడదెబ్బతో మహిళ మృతి
నందలూరు: మండలంలో వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. మండలంలోని నాగిరెడ్డిపల్లె అరవపల్లె జడ్పీ గ్రౌండ్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ మహాబూబ్‌జాన్ (50) అనే మహిళ తెల్లవారు జామున 4 గంటలకు వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గత కొద్ది రోజులుగా వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపామన్నారు. ఆమెకు భర్త షేక్ ఖాదర్‌వలీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
కమలాపురం :మండల పరిధిలోని గంగవరం గ్రామంలో యం నారాయణమ్మ 71 అనే వృద్ధురాలు వడదెబ్బ సోకి గురువారం మృతి చెందింది. మధ్యాహ్నసమయంలో అనారోగ్యానికి గురైన ఆ మహిళకు చికిత్స చేయిస్తుండగా ఆమె మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో మండలంలో వడదెబ్బ మృతుల సంఖ్య 11కు చేరింది.