కడప

ఎగసిన ఉక్కుసెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 14: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో, రాయలసీమలోని కడప జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ నిర్మాణం ఫీజబులిటీ కాదని సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసిందన్న వార్తలతో జిల్లా అట్టుడికిపోయింది. ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై వౌనం వహిస్తే తాము ప్రచారంలో ఎక్కడ వెనుకబడిపోతామోనన్నట్లు అన్ని ప్రధాన పార్టీలు పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు చేశారు. పాత్రికేయుల సమావేశాలు నిర్వహించి 3ఉక్కుపై పట్టుసడలించేది లే2దని ఘంటాపథంగా ప్రకటించారు. ఇంతటితో నిరసనలు ఆగవని, మరింత ఉధృతం చేస్తామని కూడా ప్రకటించాయి. మరోవైపు బీజేపీ మాత్రం, అఫిడవిట్‌లో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు ఫీజబులిటీ కాదని ఎక్కడా చెప్పలేదని, అన్ని రాజకీయపార్టీలు బీజేపీని రాయలసీమవాసుల దృష్టిలో చులకన చేసేందుకు అసత్యప్రచారానికి పూనుకున్నాయని చెబుతోంది. ఇంకోవైపు రాయలసీమ సంఘాలు అన్ని రాజకీయపార్టీలను విమర్శిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తొలి ఆరునెలల్లోనే కేంద్రం ఏర్పాటుచేసిన కొన్ని స్టీల్ కంపెనీలు, ఉక్కుపరిశ్రమ ఏర్పాటు ఫీజబులిటీకాదని నివేదికలు ఇచ్చాయని, అప్పుడు ఎవరూ ఆందోళనలు ఎందుకు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో టాస్క్ఫోర్స్ నియమించిందని, ఆ మధ్యకాలంలో ఏ రాజకీయపార్టీ ఉక్కుపరిశ్రమపై మాట్లాడక పోవడం రాయలసీమపై ఉన్న చిన్నచూపేనని వారంటున్నారు. కడప ఉక్కు అంశం కేవలం రాయలసీమ అంశం కాదని, ఇది రాష్ట్ర అంశమని, అయినా ఏ ఒక్కరాజకీయపార్టీ దీన్ని రాష్ట్ర అంశంగా తీసుకుని రాష్టవ్య్రాప్త ఆందోళనలు చేయకపోవడం, రాయలసీమపై వారికున్న చిన్నచూపు ఏమిటో అర్థవౌతోందని వారంటున్నారు.
కాగా జిల్లా కేంద్రంలో గురువారం తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఎంపి అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తదితరులు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. సీపిఐ ఏడురోడ్ల కూడలిలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ తగులబెట్టి నిరసన తెలిపారు. సీపీఎం పాతబస్టాండులో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను తగులబెట్టింది. కాంగ్రెస్‌పార్టీ తమ కార్యాలయ సమీపంలో విశే్వశ్వరయ్య సర్కిల్‌లో నిరసన తెలిపింది. ఇక ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంకై పోరాటం ప్రారంభించిన రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ , బీజేపీ నేత కందుల రాజమోహన్‌రెడ్డి ఇంటిని ముట్టడించి అరెస్టయ్యారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ఆందోళనలు ఇంతటితో ఆపబోమని మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు ప్రకటించారు. పార్టీ సమన్వయ కమిటిలో చర్చించి నిరవధిక నిరాహారదీక్షకు కూర్చుంటామని రమేష్‌నాయుడు ప్రకటించారు. ఏమైనా కడప జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీపై ఇన్నాళ్లూ ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు, తామే ఫ్యాక్టరీని తెస్తామని ప్రకటనలు చేశారు. అవన్నీ ప్రగల్భాలేనని తేలిపోయింది. రాయలసీమ సంఘాలు చెబుతున్నట్లుగా, మొదటి ఆరునెలల్లోనే కేంద్రం ఏర్పాటుచేసిన స్టీల్ అథారిటీ కంపెనీలు ఇక్కడ ఫీజబులిటీ లేదని రిపోర్టు ఇచ్చినప్పుడు ఏ ఒక్కరు నోరుమెదపకపోవడం, ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో ఈ అంశంపై పోటాపోటీ నిరసనలు, ప్రకటనలు చేయడం వారి చిత్తశుద్దిని శంకించాల్సిన పరిస్థితేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్టవ్రిభజన బిల్లులోని ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని రాష్ట్ర సమస్యగా కాకుండా, ఇదేదో రాయలసీమకు అందులోనూ కడప జిల్లాకు మాత్రమే పరిమితమైన సమస్యగా రాజకీయపార్టీలు భావిస్తుండటం కూడా రాయలసీమ వాసులను కలవరపరుస్తోంది.

కడప ఉక్కు రాయలసీమ హక్కు
* విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి
సుండుపల్లె, జూన్ 14: కడప ఉక్కు రాయలసీమ ప్రజల హక్కు అని రాజంపేట ఎమ్మెల్యే, విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని జీకే రాచపల్లెలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీపై బీజేపీ ఆడిన నాటకంతో జిల్లా ప్రజలు, నిరుద్యోగులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో ఇచ్చిన 19 హామీలలో ఒకటైన కడపలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన ఉందన్నారు. ఆనాటి హామీలను తుంగలోతొక్కిన కేంద్రంమాటలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం నుండి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని టీడీపీ జిల్లా నాయకులందరం కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఉక్కు పరిశ్రమకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుటకు సీఎం రూ.500 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీలను గడువులోపు నెరవేర్చకపోతే బీజేపీకి కాంగ్రెస్‌కు పట్టినగతే పడుతుందన్నారు. దేశం మొత్తం ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ కేంద్రంతో కుమ్మక్కై జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. రాబోవు ఎన్నికల్లో వైకాపా, బీజేపికి ప్రజలు బుద్ధిచెబుతారని తీవ్రంగా విమర్శించారు. జిల్లా ప్రజలు ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకై టీడీపీకి మద్దతిచ్చి సహకరించాలన్నారు.