కడప

మోదీగారు ఆ రామచంద్రుడి బాటలో నడవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ, జూన్ 21: కడప జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ స్థాపనకోసం నగరంలోని తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ చేస్తున్న నిరాహారదీక్షకు భద్రాచలం తెలుగురైతు హాజరై మద్దతు పలికారు. జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ స్థాపన ఆంధ్రుల న్యాయమైన కోరిక అన్నారు. ఉక్క్ఫ్యుక్టరీ ఈప్రాంతవాసుల చిరకాలకోరిక అన్నారు. గతంలో రాక్షసులు సైతం వరాలకోసం తపస్సులు చేసేవారని, ప్రస్తుత పరిస్థితుల్లో నిరాహారదీక్షలు తపస్సులా చేయాల్సివస్తోందన్నారు. గాందీ మహాత్ముడు ఖడ్గంకన్నా బలమైన నిరాహారదీక్ష అనే ఆయుధాన్ని మనకు అందించారన్నారు. చరిత్రలో రాజులు, రాజ్యాలు పోయాయని వారేమీ వెంటపెట్టుకుపోలేదని ప్రజలకు వారుచేసిన మేలునుమాత్రమే భూమిపై నిలిచి ఉన్నాయన్నారు. ఎవరైనా ఇక్కడస్థిరంగా ఉంటారా అంటూ ప్రశ్నించారు. గాంధీ, నెహ్రూ లాంటి మహనీయులు సైతం వెళ్లిపోయారన్నారు. అయోధ్యలో రామాలయం లాగానే ఇది ప్రజాలయం అని అందరూ ముక్తకంఠతో కోరేదాన్ని ఇచ్చి రామభద్రుడి దారిలో నడవాలని మోదీకి హితవుపలికారు. సిఎం రమేష్ సేవాభావంతో ప్రజలకోసం ఈ కోరిక కోరుతున్నారన్నారు. పరిశ్రమ సాధించుకోవడంలో విజయమో వీర మరణమో తేల్చుకోవాలని సూచించారు. అసాధ్యాన్ని సుసాద్యం చేసుకునేందుకు పట్టుదల, కృషి కావాలన్నారు. మోదీ వివక్షకు దూరంగా తన ప్రత్యేకత చాటుకుని నాకు దేశమంతా ఒక్కటేనని రుజువు చేయాలన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన ఆర్యవైశ్యసంఘం నాయకులు బూశెట్టి మాట్లాడుతూ మన హక్కులకోసం నిరాహారదీక్షలుచేసి బలిదానాలు కావాల్సిన పరిస్థితులు ఉన్నాయేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టంలో పెట్టిన కోర్కెలు సాధించుకునేందుకు కూడా ఇంత కష్టపడాలా అన్నారు. వీరిదీక్షతో ఉక్కు కర్మాగారం వస్తుందో రాదోకాదని ప్రజలు మాత్రం చైతన్యవంతులవుతున్నారన్నారు. తమకు రావాల్సింది తప్పక సాధించుకుంటారన్నారు. అందరూ వీధుల్లోకివచ్చి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడకుండా కేంద్రం చూసుకోవాలని కోరారు.

మహిళలకోసం జిల్లాలో రక్షిత మహిళ టీమ్ ఏర్పాటు
కడప క్రైం, జూన్ 21: ఎస్పీ అట్టాడ బాబూజీ ఆధ్వర్యంలో మహిళల ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గృహ హింస, పిల్లలు, మహిళలపై లైంగిక దాడులు, బాల్యవివాహాలు తదితర దాడులు అరికట్టేందుకు రక్షిత మహిళ టీమ్‌ను ఏర్పాటుచేశారు. జిల్లాను ఆరు డివిజన్లుగా విభజించి ఒక్కో డివిజన్‌కు ఆరుమంది మహిళ పోలీసులు, వారితో కలిసి పనిచేసేందుకు సీనియర్ పోలీసులు కలిపి రక్షిత మహిళ టీమ్‌ను ఏర్పాటుచేశారు. వీరికి త్వరలో వాహనాలు సమకూర్చునున్నారు. ఈ ఆరు టీమ్‌లు కడప మహిళా స్టేషన్ డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో పనిచేయనున్నాయి. జిల్లాలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థతో రాష్ట్రంలో కడప పోలీసుల పనితీరును ప్రదర్శింపచేసిన ఎస్పీ బాబూజీ, కొత్తగా శిక్షణ పూర్తిచేసుకునివచ్చిన మహిళా కానిస్టేబుళ్లతో మహిళల రక్షణకోసం రక్షిత మహిళ టీమ్‌లు ఏర్పాటుచేశారు. త్వరలో వీరు జిల్లాలో తమ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది.