కడప

శిశుమరణాలపై దృష్టి సారించలేని వైద్య ఆరోగ్యశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్, జూన్ 21: జిల్లాలో శిశుమరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కడప జిల్లాలోని పెనగలూరు మండలంలో 36 శిశుమరణాలు సంభవించగా, రాయచోటిలో 20 నమోదయ్యాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్టస్థ్రాయి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో రాష్ట్రంలో శిశుమరణాలు, మాతామరణాలు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఆ దిశగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంవల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈమరణాలు ప్రభుత్వ గణాంకాలకు తెలియకుండానే అధికంగా సంభవించడంవల్ల అధికారులు వాటిని లెక్కలోకి పరిగణించలేదు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ఇండ్లవద్ద ఎన్ని శిశుమరణాలు జరుగుతున్నాయో అధికారులకు లెక్కచిక్కలేదు. దీన్ని బట్టిచూస్తే జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదన్న విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడంతో శిశుమరణాలు గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో నివారించడంలో ఆశాఖ విఫలమైంది. గర్భణీ స్ర్తిలను చైతన్యపరచకపోవడం, వారికి ఆరోగ్యసూత్రాలపట్ల అవగాహన కల్పించకపోవడంతో ఈమరణాల సంఖ్యపెరుగుతోంది. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్ర్తిలకు ఐరన్ మాత్రలు అందించడంలో ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా అందుకున్న పౌష్టికాహారం సక్రమంగా అందించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో మాతాశిశుమరణాలు తీవ్రవౌతున్నాయి. దైనందిన కార్యకలాపాల్లో జాగ్రత్తలు తీసుకోని ప్రభావం వల మాతాశిశుమరణాల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తున్నా, కొన్ని ప్రాంతాల్లో శిశుమరణాలు రేట్లు తగ్గడం లేదు. 2017 ఏప్రిల్ మాసం నుండి 2018 మార్చి వరకు నమోదైన శిశుమరణాల్లో 32శాతం అత్యధికంగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో నమోదుకాగా, 2వస్థానంలో విశాఖపట్టణం, శ్రీకాకుళం, గుంటూరు, కడప జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ శిశుమరణాలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యిమందికి 39 మంది శిశుమరణాలు సంభవిస్తుండగా, రాష్ట్రంలో ఈసంఖ్య 34కు చేరింది.
శిశుమరణాలకు అనేక కారణాలు
తక్కువ బరువుతో శిశువులు పుట్టడం, శ్వాసకోశ సమస్యలు తలెత్తడం వల్లకొన్ని మరణాలు సంభవిస్తున్నాయని వైద్య గణాంకాలు పేర్కొంటున్నాయి. శిశువులకు ముర్రుపాలుతో సహా చనుబాలు ఇవ్వలేని స్థితిలో తల్లులు ఉండటం, బయటి పాలు పట్టకపోవడం వల్ల అధిక ఇనె్ఫక్షన్లకు గురై శిశుమరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాల్యవివాహాలు, శిశువుకు తగ్గట్టు గర్భసంచి తయారుకాకపోవడం, తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు పెద్దాసుపత్రులకు తరలించడంతో జాప్యంకారణంగా, సంప్రదాయపద్దతులతో కూడిన కాన్పులు జరగడం ఒకటైతే, ఇంటి వద్దే ప్రసవాలు కావడం మరికొన్ని కారణాలతో శిశుమరణాల సంఖ్య పెరుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది.

2వ రోజుకు చేరిన ఉక్కుదీక్షలు
* సంఘీభావం తెలిపిన వివిధ వర్గాలు * భారీగా తరలివచ్చి మద్దతు తెలిపిన విద్యార్థులు
కడప, జూన్ 21: ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకై ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు, ఎమ్మెల్సీ బీటెక్ రవీలకు 2వ రోజుకూడా భారీఎత్తున జనాదరణ లభించింది. ఉద్యమం చేపట్టి గురువారానికి రెండవ రోజు కావడంతో వివిధ వర్గాలు భారీగా తరలివచ్చాయి. నగరంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు వందల సంఖ్యలో తరలివచ్చి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వారికి తెలిపారు. బ్రాహ్మణసంఘం, న్యాయవాదుల సంఘం, ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. కాగా ఈసమావేశానికి గనులశాఖ మంత్రి సుజయ్ కృష్ణారంగారావు, జిల్లాకు చెందిన మంత్రి సి.ఆదినారాయణరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్, కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎం.లింగారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి, డీసీసీ బ్యాంకు చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా అద్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, జిల్లాకార్యదర్శి బి.హరిప్రసాద్, పార్టీ రాష్టక్రార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, నగర అధ్యక్షుడు జిలానీబాషా, మాజీ అధ్యక్షుడు బాలకృష్ణయాదవ్, డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సోహెల్, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాధశర్మ, జిల్లా డైరెక్టర్ జనార్ధన్ తదితరులు ఈసమావేశంలో పాల్గొన్నారు.