కడప

దీక్షను విరమింపచేసిన వైకాపా నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, జూన్ 21: రాబోయే 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆరునెలల్లో స్టీల్ ప్లాంటుకు శంఖుస్థాపన చేస్తారని, వైకాపా సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. గత రెండు రోజులుగా ఉక్కు కార్మాగారం కోసం రెండు రోజులు నిరాహార దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి గురువారం నజ్జల రామక్రిష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా, రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబులు తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భం వారు మాట్లాడుతూ నాలుగేళ్లగా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టిడిపి పూర్తిగా విఫలమైందన్నారు. టిడిపి, బిజేపి దొంగాటలు ఆడుతున్నాయన్నారు. వైయస్ హయంలో జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని సంకల్పించారన్నారు. దాన్ని అమలు చేయాల్సిన భాద్యత ప్రభుత్వంపై వుందన్నారు. కానీ కేంద్రం రాష్ట్ర విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. నాలుగేళ్లుగా నిద్రపోతున్న టిడిపీ నేడు దొంగదీక్షల పేరుతో ప్రజలను మభ్య పెడుతుందన్నారు. 25 మంది ఎంపిలను ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తానని చెబుతున్నా సియం చంద్రబాబు ఇప్పటికే 19 మంది ఎంపిలు వుంటే ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారన్నారు. 25 మంది ఎంపీలను వైసిపికి ఇస్తే స్టీల్ ప్లాంట్ సాధిస్తామన్నారు. అఖిలపక్షం నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుందన్నారు. వైయస్ జీవించి వుంటే ఉక్కు పరిశ్రమ ఏప్పుడో వచ్చేదన్నారు. ఓ ప్రవేటు సంస్థ పరిశ్రమలు వస్తే ప్రభుత్వ సంస్థ సెయిల్ అధ్వర్యంలో నిర్మించలేమని చెప్పడం ఎంత వరకు సబబు అన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా రాజీనామాకు సిద్దమైనప్పుడే పరిష్కారం లభిస్తుందన్నారు. దొంగదీక్షలు చేస్తున్న టీడీపీ నాయకులు రాజీనామాకు సిద్దమా అని సవాల్ విసిరారు.