కడప

మరో రెండురోజులపాటు పాఠశాలలకు సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్, జూన్ 21: రాష్ట్రంలో ఎండలు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం మరో రెండురోజులపాటు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి శైలజా తెలిపారు. ఈసెలవులు ఆదివారం వరకు ఉంటాయన్నారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం నుండి జిల్లాకు ఉత్తర్వులు అందాయని ఆమె పేర్కొన్నారు. గత రెండురోజుల క్రితం మూడురోజులపాటు సెలవులు ఇప్పటికీ ప్రకటించామని, వేసవిని తలపించే విధంగా ఎండల తీవ్రత పెరగడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ముందుజాగ్రత్తలో చర్యల్లో భాగంగా ఈనిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తిరిగి సోమవారం నుండి పాఠశాలలను యధావిధిగా ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా పాఠశాలలు తెరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
కడప సిటీ, జూన్ 21: కడప జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ సాధనకోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో నగరంలోని ఏడురోడ్ల కూడలివద్ద సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం ఉదయం ప్రారంభమైన ఈకార్యక్రమ శిబిరాన్ని డీసీసీ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్ సందర్శించి సంతకం చేసి మద్దతు పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రజలందరితో సంతకాలు సేకరించి ప్రజల కోరికను కేంద్రానికి తెలియజేస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉక్కుపరిశ్రమ స్థాపనకోసం కావాల్సిన వౌళిక వసతులన్నీ కల్పిస్తామని హామీఇచ్చినా ఇంతవరకు కేంద్రం ఉక్క్ఫ్యుక్టరీపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం అన్యాయమన్నారు. రాయలసీమలోనే వెనుకబడిన ప్రాంతమైన కడప జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ స్థాపిస్తే రాయలసీమలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధిచెందే అవకాశం ఉందన్నారు. అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు వచ్చి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ స్థాపనకు ఫీజుబులిటీ లేనందువల్ల ఫ్యాక్టరీ ఇవ్వలేమని చెప్పడం సబబుకాదని, ఫీజుబులిటీ కల్పించి, ఫ్యాక్టరీ ఇచ్చి జిల్లాను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈమధ్యనే ఈఫ్యాక్టరీ అంశాన్ని నెత్తికెత్తుకుందన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధిచేయాల్సివుండగా, కడప జిల్లాపట్ల ఉదాసీనత చూపడం అర్థం పరమార్థం ఆయనకే తెలియాలన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ మాట్లాడుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని, ప్రజలు స్వచ్చంధంగా వచ్చి సంతకాలుచేస్తూ ఉక్కు ఫ్యాక్టరీపట్ల తన ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారన్నారు. ఫ్యాక్టరీ సాధనలో మేం కూడా సహకరిస్తామన్నా తెలుగుదేశంపార్టీ ఒంటెద్దుపోకడ పోతోందన్నారు. నిన్నటి నుండి టీడీపీ నేతలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. గతంలో ఉక్కు ఫ్యాక్టరీకోసం ఎన్నో ఉద్యమాలు చేసినా ఆ ఉద్యమాలను ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కివేసిందన్నారు.