కడప

ఉక్కు పరిశ్రమ కోసం భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వేకోడూరు, జూన్ 21: రైల్వేకోడూరులో టీడీపీ ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనాథనాయుడు నాయకత్వంలో గురువారం భారీ ర్యాలీతో పాటు రాస్తారోకో నిర్వహించారు. కడప నగరంలో ఎంపీ సీఎం రమేష్ చేపట్టిన దీక్షకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక రైల్వేస్టేషన్ నుంచి మహాత్మాగాంధీ విగ్రహం, బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అనంతరం టోల్‌గేట్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కస్తూరి మాట్లాడుతూ గత ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని నాలుగేళ్ల పాటు నమ్మబలికి చివరకు ప్రతిపక్ష నాయకులతో చేతులు కలిపి రాష్ట్రాన్ని నట్టేటన ముంచారని ఆయన కేంద్రం పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఆ పార్టీ అడుగంటి పోయిన తర్వాత బీజేపీలో చేరి నేడు టీడీపీ ప్రభుత్వ పనితీరును విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. అధికారం కోసం రోజుకో పార్టీ మారుతున్న నేతలు కొంతమంది టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. రాష్ట్రం విడిపోయి రూ. 16 వేల లోటుబడ్జెట్ ఉన్నా కేంద్రం సహకరించకపోయినా సీఎం చంద్రబాబునాయుడు తన పాలన దక్షతతో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుంటే పార్టీలు మారిన పలువురు నాయకులు ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు ప్రజల పక్షాన రాష్ట్ర సంక్షేమం కోసం ఉద్యమాలు చేస్తుంటామన్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎస్సై వెంకటేశ్వర్లు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు.

వడ్డెర హక్కుల కోసం నిరంతర పోరాటం
* జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలకొండయ్య
రాయచోటి, జూన్ 21: అన్ని విధాలుగా వెనుకబడిపోయిన వడ్డెర్ల హక్కులను సాధించడానికి గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటుచేసి వారి హక్కుల సాధనకోసం అవిశ్రాంత పోరాటం చేస్తామని కడప జిల్లా వడ్డెర సంక్షేమం సంఘం అధ్యక్షులు ఓర్సు బాలకొండయ్య అన్నారు. రాయచోటి నియోజకవర్గ వడ్డెర కార్యకర్తల సమావేశం స్థానిక వైష్ణవి నర్సింగ్ మీటింగ్ హాల్‌లో గురువారం జరిగింది. ఈ సమావేశాన్ని వడ్డెర్లకు సంబంధించిన సమస్యలపైన వారి హక్కులపై అవగాహన కల్పించడానికి రాయచోటి నియోజకవర్గ ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకొండయ్య మాట్లాడుతూ నేటికీ అన్నిరంగాల్లో వెనుకబడిపోయిన వడ్డెర్లు ముందుకు రావాలంటే వారి హక్కులపై వారికి చైతన్యం ఉండాలన్నారు. అనంతరం మున్సిపల్ మాజీ ఛైర్మన్ వీరభద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మంది వడ్డెర్లు ఉన్న్పటికీ ఏ రాజకీయ పార్టీకూడా ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రతి రాజకీయ నాయకునికీ అన్ని విషయాలలో వెన్నుదన్నుగా ఉంటున్నప్పటికీ మండలస్థాయికి కూడా మమ్ములను అణగదొక్కుతున్నారని విమర్శించారు. అనంతరం నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు.