కడప

ల్యాడ్జిలో కూర్చుని ఉక్క్ఫ్యుక్టరీ తెస్తావా విష్ణు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,జూన్ 23: రాయలసీమ మొత్తం ఉక్క్ఫ్యుక్టరీ కోసం తల్లడిల్లుతుంటే ఎక్కడో ల్యాడ్జిలో కూర్చుని విలేఖర్ల సమావేశం నిర్వహించి జిల్లాకు ఉక్క్ఫ్యుక్టరీ తెస్తానంటూ తీర్మానాలు చేస్తావా విష్ణువర్ధన్‌రెడ్డి అంటూ బీజేవైఎం రాష్ట్ర నాయకున్ని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, టీడీపీ రాష్టక్రార్యవర్గ సభ్యుడు గోవర్దన్‌రెడ్డిలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రపంచ మేధావి అన్నారు. ఆయనకు మంచి పేరు రాకూడదని కక్షకట్టి, రాష్ట్రంపై వివక్షత చూపుతున్నారన్నారు. మోదీ గెలిచాక దేశ సమస్యలను పరిష్కరిస్తారని ఆశించామని, అయితే ఆ ఆశయం నెరవేరలేదన్నారు. కర్నాటకలో ఓడారని, దేశంలో ఎక్కడ కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదన్నారు. నిస్వార్థంగా పనిచేయాలని, రాయలసీమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు కడపలో సమావేశమై అవాకులు చవాకులు పేలితే చాలదన్నారు. ఉక్క్ఫ్యుక్టరీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ప్రారంభిస్తావో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ నేతగా మాట్లాడుతున్న కందుల రాజమోహన్‌రెడ్డి ఏపార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదన్నారు. వారు వ్యాపారస్తులని ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలో ఉంటారని ఎద్దేవా చేశారు. రాయలసీమకు ఉక్కు ఇవ్వండి, లేకుంటే మేము రాయలసీమలో తిరగలేమని ప్రధాని మోదీకి చెప్పండి అంటూ సూచించారు. కేంద్రంతో మాట్లాడి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకుని రండి మీకు ఘన స్వాగతం పలుకుతామన్నారు. నాలుగు సంవత్సరాలు నుంచి ఆంధ్రులను ఏడిపించి ఏమిచ్చారని ప్రశ్నించారు. ఉక్కు ఫ్యాక్టరీపై ప్రధాని అనుమతితో జీవో తీసుకుని రండి లేదంటే ప్రజలు మిమ్ములను తరమికొడతారన్నారు.

ఉక్కు ఉద్యమదీక్షకు మద్దతుగా మైదుకూరు సత్తా చాటాలి
* టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్
మైదుకూరు,జూన్ 23: కడప ఉక్కుసాధన కోసం ఎంపి రమేష్, ఎమ్మెల్సీ బిటెక్ రవి చేపడుతున్న ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా మైదుకూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివెళ్లి వారికి సంఘీభావంగా తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి సత్తా చాలాని టీటీడీ చైర్మన్, నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టవ్రిభజన చట్టంలో కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తున్నట్లు నాటిపాలకులు స్పష్టంగా ప్రకటించినప్పటికీ నేటి బీజేపీ పాలకులు ఉక్క్ఫ్యుక్టరీని తుంగలో దొక్కుతున్నారని ధ్వజమెత్తారు. దీన్ని నిరసిస్తూ ఉక్క్ఫ్యుక్టరీ సాధనగా దీక్షలుచేస్తున్నారన్నారు. మద్దతుగా 25న సోమవారం 4వేల మందికి పైగా కార్యకర్తలు తరలివెళ్లాలన్నారు. కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని చేపట్టే కార్యక్రమాన్ని సిఎం పరిశీలిస్తున్నారన్నారు.