కడప

నీరసంగా సిఎం రమేష్, బిటెక్ రవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,జూన్ 23: నాలుగురోజులుగా నిరాహారదీక్షలో కూర్చున్న ఎంపీ సిఎం రమేష్, ఎమ్మెల్సీ బిటెక్ రవిల ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తోంది. శనివారం రిమ్స్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఇరువురిని పరిశీలించి శుక్రవారం సాయంత్రం తీసుకున్న బ్లడ్ శాంపిల్ రిపోర్ట్స్‌ను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిఎం రమేష్ బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ 66 పాయింట్లలో ఉందని, 80నుండి 120లోపల ఉండాల్సిన ఈస్థాయి తగ్గిపోతోందన్నారు. అలాగే కీటోన్స్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయన్నారు. ఈపరిస్థితిని హైపోగ్లైసీమియా అంటారని, ఇది ఇలాగే కొనసాగితే కిడ్నీలకు కూడా సమస్యలు ఎదురుకావచ్చునన్నారు. అలాగే బిటెక్ రవి షుగర్ స్థాయి 78పాయింట్లకు చేరిందని, ఈయన గతంలో కూడా డయాబిటిక్ అన్నారు. సిఎం రమేష్‌నాయుడు నాన్ డయాబిటిక్ అయినప్పటికీ దీక్షలో ఉన్నందువల్ల షుగర్ లెవెల్‌లో మార్పులు జరిగాయన్నారు. మరోసారి బ్లడ్ శ్యాంపిల్స్ తీసుకుని పరిశీలిస్తామన్నారు. ప్రశాంతంగా ఉండాలని, అనవసరంగా డిస్టర్బ్ కాకూడదని వారికి సూచించామన్నారు. ఈయన పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ తెలుగుదేశమే రావాలి
* పార్టీకి హిజ్రాల మద్దతు
కడప సిటీ,జూన్ 23:కడప జిల్లాకు ఉక్క్ఫ్యుక్టరీ రావాలని నిరాహారదీక్ష చేస్తున్న శిబిరానికి జిల్లావ్యాప్తంగా ఉన్న హిజ్రాలు మద్దతు తెలుపుతూ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రేమ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వమే మమ్ముల్ని మనుషులుగా గుర్తించిందని వారు ఇస్తున్న పెన్షన్ మాకు ఎంతో ఆధారంగా ఉందన్నారు. ఇలాంటి పార్టీ మళ్లీమళ్లీ గెలవాలని, కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ రావాలని ఎంపీ రమేష్ నాయుడుచేస్తున్న దీక్ష సఫలం కావాలని ఆశీర్వదించారు.