కడప

స్నేహమైనా యుద్ధమైనా ఇలాగే చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,జూన్ 23: ఎవరితోనైనా స్నేహమైనా యుద్ధమైనా ఆంధ్రులుగా ఇలాగే చేస్తామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శనివారం అన్నారు. నగరంలో జరుగుతున్న ఉక్క్ఫ్యుక్టరీ నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించిన మంత్రి మాట్లాడుతూ ఈదీక్ష చారిత్రాత్మకదీక్ష అన్నారు. నాలుగేళ్లక్రితం బీజేపీతో కలిసి అలయన్స్‌తో ఎన్నికలకువెళ్లి గెలిచామని, దీంతో ఏపీకి మంచిరోజులు వస్తాయని ఆశించామన్నారు. అయితే అనుకున్నది ఏదీ జరగలేదన్నారు. ఆంధ్రలో తెలుగుదేశం, తమిళనాడులో శివసేనలు మిత్రపక్షాలుగా వైదొలిగామన్నారు. ఉక్కు కోసం గెలిచిన రోజునుండి ప్రయత్నిస్తునే ఉన్నా మోదీ సహకరించలేదని,దీంతో తాడో పేడో తేల్చుకునే ఉద్దేశ్యంతోనే చంద్రబాబునాయుడు మంత్రివర్గం నుండి సైతం మా మంత్రులను ఉపసంహరించుకున్నారన్నారు. ఉక్క్ఫ్యుక్టరీని అడుగుతున్నా కక్షసాధింపు ఉద్దేశ్యంతోసుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసి కడుపుకాల్చారన్నారు. ఉక్క్ఫ్యుక్టరీ కోసం రాష్ట్రప్రభుత్వం వౌలిక వసతులన్నింటినీ కల్పిస్తూ ఈక్విటీ సైతం ఇస్తామన్న కేంద్రం సహకరించకపోవడం దారుణమన్నారు. ఉక్కుకోసం దీక్ష చేస్తున్న రమేష్ రెండున్నర కేజీలు , రవి రెండుకేజీలు బరువుతగ్గారన్నారు. ఇవి దొంగదీక్షలు కాదన్నారు. సిఎం రమేష్ చేస్తున్న ఈదీక్ష చారిత్రాత్మక దీక్ష కావాలన్నారు. మరో మంత్రి అమరనాధరెడ్డి మాట్లాడుతూ కడప ఉక్కు-రాయలసీమ హక్కు అన్నారు. ఆనాడు కాంగ్రెస్‌పార్టీ మనోభావాలకువిరుద్దంగా విభజించిందని , ఈనాడు ఆకాంక్షలు నెరవేరుస్తామని నమ్మించిన బీజేపీ మోసం చేసిందన్నారు. ఫీజుబులిటీ లేదని చెబుతున్నప్రభుత్వం ఒక్కసారి ఉక్క్ధురలు గమనించాలన్నారు. సెయిల్ పరిశీలన చేసినప్పుడు రూ.40లు ఉన్న ఉక్కు ఇప్పుడు రూ.60లు అయ్యిందన్నారు. ఫీజుబులిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లో రాయలసీమకు ఫ్యాక్టరీ ఇవ్వరాదన్న దురుద్దేశ్యం తప్ప మరో ఉద్దేశ్యం వారికి లేదన్నారు.
కడప పెన్నార్ పేపర్ మిల్లు మూసివేసి 28ఏళ్లు
* ఏప్రభుత్వాలు మిల్లును తెరిపించేందుకు కృషి చేయలేదు
* ప్రైవేట్ పారిశ్రామిక వేత్తలు పరిశీలనలో పెన్నార్ పేపర్ మిల్లు
చెన్నూరు,జూన్ 23: మండలంలోని ఓబులంపల్లి గ్రామసమీపంలో వాటర్‌గండి కొండ ఎగువ భాగంలో 300 ఎకరాలు విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పేపర్‌మిల్లు మూసివేసి నేటికి 28 ఏళ్లు. ఈమిల్లు ముగ్గురు పారిశ్రామిక వేత్తలు మారినప్పటికీ మిల్లులో పనిచేసే కార్మికులకు చేయూతనివ్వాల్సిన యూనియన్ నాయకులు, యాజమాన్యాలతో గొడవలకు దిగడం, ఫ్యాక్టరీని నడపలేక యాజమాన్యాలు చేతులెత్తేశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1980లో కడప నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్షవర్ధన్‌రెడ్డి ప్రభుత్వంనుంచి భూమిని లీజుకు తీసుకుని 300 ఎకరాల్లో పేపర్ మిల్లు స్థాపించారు. పేపర్ మిల్లు స్థాపించిన ఏడాదిలోనే 1981లో ఉత్పత్తిని ప్రారంభించింది. మిల్లులో 600 మంది కార్మికులు పనిచేస్తూ ఉండేవారు. ఈ మిల్లుకు అవసరమైన వనరులు, పెన్నానది దగ్గరగా నీటి వసతి ఉండగా మిల్లుసక్రమంగా నడుస్తూ వచ్చింది. ఈ మిల్లును కొనే్నళ్లపాటు నడిపిన యాజమాన్యం తమిళనాడు రాష్ట్రానికి చెందిన కొయంబత్తూర్‌కు చెందిన పారిశ్రామిక వేత్తకు అప్పట్లో లీజుకు ఇచ్చారు. ఈయన కూడా మూడేళ్లపాటు లీజుకు తీసుకుని సక్రమంగా నడపలేక వెళ్లిపోయారు. మిల్లు ఆరునెలలపాటు మూతపడగా, రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త మిల్లును నడిపేందుకు ముందుకు వచ్చారు. ఈయన ఐదేళ్లపాటుమిల్లును నడిపిన నష్టాలు రావడంతో మూసివేశారు. దీని కారణంగా 1981నుండి 1990 వరకు పెన్నార్ పేపర్ మిల్లు అనేక ఒడిదడుకులతో పనిచేసింది. అప్పటి నుండి యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో మిల్లులో పనిచేసే కార్మికులు తలోదారి వెళ్లిపోయారు. మిల్లును ఏర్పాటుచేసేందుకు యాజమాన్యం ఆంధ్రాబ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల నుంచి రూ.3కోట్లురుణంగా తీసుకోగా ఆ రుణం చెల్లించకపోవడంతో మిల్లును బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఏళ్లుగడిచి పోవడంతో మిల్లుబకాయిలు రాని బకాయిల కింద చేయడంతో ప్రస్తుతం పెన్నార్‌పేపర్ మిల్లు బకాయిలు లేవని బ్యాంకు అధికారులే అంటున్నారు. ఏళ్ల తరబడి మూతపడిన పేపర్‌మిల్లును తెరిపించేందుకు ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రాలేదు. ప్రస్తుతం పెన్నార్ పేపర్ మిల్లు తుప్పుపట్టి యంత్రాలు చాలావరకు కనుమరుగయ్యాయి. మిల్లుప్రాంతమంతా అటవీమొక్కలతో దట్టంగా అలుముకుని పోయింది. పేపర్‌మిల్లుకు వెళ్లేదారి కూడా కనిపించని విధంగా చెట్లతో నిండిపోయింది. అయితే కొంతమంది ప్రైవేట్ పారిశ్రామిక వేత్తలు పెన్నార్ పేపర్ మిల్లు ఉన్నప్రాంతాన్ని పరిశీలించి అదే స్థానంలో పేపర్‌మిల్లు ఏర్పాటు చేయాలా లేక సోలార్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. చెన్నూరు మండలానికి చెందిన ప్రముఖపారిశ్రామిక వేత్త హైదరాబాద్‌లో స్థిరపడి పోవడం, తమ దగ్గరలో ఉన్న పేపర్‌మిల్లు స్థానంలో ఏదైనా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు పరిశీలించినట్లు తెలిసింది. అయితే జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సరైన స్థలాలు లేకపోవడం, ఉన్న స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం వల్ల అధికారులు తలమునకలై ఉన్నారు. కడప నగరానికి సమీపంలో ఉన్న పేపర్‌మిల్లు రాష్ట్రప్రభుత్వం పరిశీలించి ప్రైవేట్ పారిశ్రామిక వేత్తలకు అప్పగిస్తే పరిశ్రమ తిరిగి పునప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌కు ‘స్వచ్ఛసర్వేక్షన్’ అవార్డు

కడప,జూన్ 23: జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్‌కు, తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా, తుడ వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన ప్రదర్శించిన పనితీరుకు అవార్డు లభించింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో వ్యర్థపదార్థాల వినియోగం ద్వారా ఉత్తమ నగరంగా తీర్చిదిద్దిన ఘనత హరికిరణ్‌కు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘స్వచ్ఛ సర్వేక్షన్- 2018’ అవార్డు హరికిరణ్ దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీలో శనివారం కేంద్ర పట్టణ వౌలిక వసతులశాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పూరి చేతులమీదుగా ఈ అవార్డును హరికిరణ్ అందుకున్నారు. కాగా హరికిరణ్ తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో తిరుపతి నగర ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలోనూ, వ్యర్థాలను వినియోగంలోకి తేవడంలో ఆయన ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను బాగా వినియోగించుకున్నారనే ప్రశంసలు అక్కడి ప్రజల నుండి కూడా వినిపించేవి. దాని ఫలితం శనివారం ఆయన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అందుకోవడం. ఈ అవార్డును అందుకుంటున్న సమయంలో హరికిరణ్‌తోపాటు చిత్తూరు జిల్లాకలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న విజయరామరాజులు ఉన్నారు.