కడప

ప్రత్యేక హోదానే నా ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరబల్లి, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా నా ఊపిరిగా భావిస్తానని రాజంపేట మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని వంగిమళ్ల గ్రామ పంచాయతీలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రత్యేకహోదా నా ఊపిరిగా భావించి తన పదవికి రాజీనామా చేశానని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రత్యేక హోదా నినాదం ఢిల్లీకి వినపడేలా ప్రతి పౌరుడు గర్జించాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా 4 సంవత్సరాలుగా టీడీపీ కేంద్ర ప్రభుత్వంతో చట్టా పట్టాలు వేసుకొని ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నందున అనేక డ్రామాలు ఆడుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి 4 సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన ఘనకార్యాలేమిటో మననం చేసుకోవాలన్నారు. వంగిమళ్ల గ్రామ పంచాయతీలోని టీడీపీకి చెందిన వంద కుటుంబాలు మిథున్‌రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారని వారు తెలిపారు. అనంతరం వీరబల్లిలోని గాలివీటి సోదరుల స్వగృహంలో వైకాపా బూత్‌లెవల్ కమిటీలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ వైకాపా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ పదవిని ఫణంగా పెట్టి ప్రత్యేకహోదాపై రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకహోదా కోసం పదవీత్యాగం చేసిన ఘనత మీదేనన్నారు. మీ నిర్ణయానికి మా జోహార్లు అని ఎమ్మెల్యేలు, మండల ప్రజలు ముక్తకంఠంతో మిథున్‌రెడ్డికి మద్దతు తెలిపారు. తాము ఎల్లవేళలా మీ వెంటే నడుస్తామని తెలిపారు.