కడప

సిఎం రమేష్ దీక్ష.. జగన్‌కు ముచ్చెమటలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడపసిటీ, జూన్ 24: కడప నగరంలో రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చేస్తున్న నిరాహారదీక్షా శిబిరాన్ని రాష్ట్ర సమాచార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తశుద్ధితో ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేస్తున్న సిఎం రమేష్‌నాయుడు దీక్ష ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ముచ్చెమటలు పుట్టిస్తోందన్నారు. దీక్షకు రాలేడు.. కేంద్రాన్ని అడగలేడు అదీ జగన్ పరిస్థితి అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ రావడం ద్వారా జిల్లా రూపురేఖలే మారిపోతాయన్నారు. ఉక్కు కోసం సహకరించడం మాని ఇక్కడ చంద్రబాబును విమర్శిస్తూ అక్కడ తన కేసుల మాఫీ కోసం విజయసాయిరెడ్డి ద్వారా మంతనాలు జరుపుతున్నారని తెలిపారు. పౌరుషాన్ని గురించి మాట్లాడే నాయకులు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేరన్నారు. ఉక్కు కోసం నిజాయితీగా కష్టపడే నేతలు ఎందుకు సమర్థించలేరని ప్రశ్నించారు. ఈ జిల్లా మీ కుటుంబానికి 35 సంవత్సరాల రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. కడపలో ఉక్కు కోసం జగన్‌కు ఎందుకు పోరాటం చేయడన్నారు. ఈ ప్రాంత ప్రజలు తమ చిరకాల వాంఛ అయిన ఉక్కు ఫ్యాక్టరీ కోరిక నెరవేరాలని ప్రతి హృదయం ఆరాటపడుతోందన్నారు. జగన్‌కు సిద్ధాంతాలు లేవు, విధానాలు లేవని, కేసుల కోసం లాలూచీ కోసం ఉక్కు కుట్రలో ఒక భాగమయ్యాడన్నారు. మీ విధానాలు రాష్ట్రానికి గొడ్డలిపెట్టులా మారాయని తీవ్ర పదజాలంతో విమర్శించారు. చంద్రబాబు పాలన రాష్ట్రానికి శ్రీరామరక్షగా ఉంటుందన్నారు. ఎక్కడి కృష్ణమ్మ ఎక్కడికి వచ్చింది, రాయలసీమలో చంద్రబాబు కృషితోనే ప్రవహిస్తోందన్నారు. జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. జగన్‌కు చెమటలు పట్టాయని, ఇక మోదీకే చెమటలు పట్టాల్సి ఉందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుంటే ఆంధ్రుల ఆగ్రహం బీజేపీ చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఉక్కు పరిశ్రమను పోరాడి సాధించుకుందాం: ఎమ్మెల్యే
రాయచోటి, జూన్ 24: సీపీఐ జిల్లా పిలుపు మేరకు ఉక్కు పరిశ్రమకై 24, 25, 26వ తేదీల్లో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ అందరం ఒకటై పోరాడి ఉక్కును సాధించుకోవాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కు పరిశ్రమను సాధించుకుందామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దొందూ దొందేనన్నారు. ఈ దీక్షలకు నా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అనంతరం వైసీపీ రాష్ట్ర నేత మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉండి ఉంటే ఈ దుస్థితి నకు వచ్చేది కాదన్నారు.