కడప

సిఎం రమేష్ దీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేల సంఘీభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 24: ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకై దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు, ఎమ్మెల్సీ బీటెక్ రవిల నిరవధిక నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరుకుంది. వారి ఆరోగ్యం క్షీణిస్తోందని, చక్కెర స్థాయిలు పడిపోతున్నాయని వైద్యులు నిర్ధారించారు. ఇప్పటికైతే ప్రమాదం లేదని, దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. అయితే ఉక్కు పరిశ్రమ ప్రకటన వచ్చేంత వరకు దీక్ష విరమించబోయేది లేదని వారిద్దరూ దీక్షా శిబిరంలోనే ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు. ఐదో రోజున అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరై వారికి సంఘీభావం ప్రకటించి ప్రసంగించారు. హాజరైన వారిలో ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప, సమాచార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు, విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, పౌరసరఫరాల శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే బోండా ఉమ, పలాస ఎమ్మెల్యే రౌతు శివాజీ, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, గుంతకల్లు ఎమ్మెల్యే ఉపేంద్రగౌడ్, సినీ దర్శకుడు, టీటీడీ బోర్డు మెంబర్ కె.రాఘవేంద్రరావు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్వరూప, ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూధనగుప్త, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తదితరులు దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటించారు. వీరంతా బీజేపీపై, వైసీపీ నేత జగన్‌పై విమర్శలు గుప్పించి ప్రసంగించారు. బద్వేలు నుండి భారీ జనసందోహం తరలివచ్చింది. ఆదివారం దీక్షా శిబిరం ప్రజలతో కిటకిటలాడింది. విద్యార్థులు, ఉద్యోగ సంఘాల వారు, బార్ అసోసియేషన్ అడ్వకేట్ తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.