కడప

సంఘీభావం తెలపకపోగా.. విమర్శలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 24: రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌నాయుడు, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు కడప జిల్లాలో ఉక్కు కోసం ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే సంఘీభావం తెలపకపోగా వారు నవనవలాడుతున్నారని విమర్శించడానికి సిగ్గు లేదా? అంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఆర్ అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డిలు సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్షలపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, అమానుషమని తెలిపారు. సీఎం రమేష్, బీటెక్ రవిలు నవనవలాడుతున్నారని వారు దీక్షలు చేయడం లేదని అనడం వారి నీచ స్వభావానికి నిదర్శనమన్నారు. దీక్షా శిబిరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎవరైనా వచ్చి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించవచ్చునని అన్నారు. వైసీపీ నేతలు దీక్షా శిబిరానికి వస్తే వారిని సాదరంగా ఆహ్వానిస్తామని, అన్నీ పరీక్షించుకోవచ్చని తెలిపారు. వారి వైద్యులను పిలిపించుకొని వైద్యపరీక్షలు చేయించుకోవచ్చని ప్రకటించారు. ఆదివారం ఉదయం రిమ్స్ వైద్యులు పరీక్షలు చేశారని సీఎం రమేష్, బీటెక్ రవిల ఆరోగ్యం క్షీణిస్తోందని బీటెక్ రవికి కామెర్లు సోకాయని వైద్యులు తెలిపారని వివరించారు. పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న రిమ్స్ డాక్టర్ గిరిధర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. బీటెక్ రవికి కామెర్లు సోకాయని గంట గంటకు పరిస్థితి తీవ్రమవుతున్నదని వీరిరువురు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ రామకోటిరెడ్డి, టీడీపీ నేత గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.