క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదంలో భార్యభర్తలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు, జూన్ 28: కడప-కర్నూలు జాతీయ రహదారిలోని చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె టోల్‌గేట్ వద్ద గురువారం తెల్లవారు జామున లారీ -కారు ఢీ కొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చెన్నూరు ఎస్‌ఐ రవికుమార్ కథనం మేరకు ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన మస్తాన్‌రావు (60), భాగ్యలక్ష్మి (50), మరోముగ్గురు కలిసి బెంగుళూరులో వైద్య పరీక్షల కోసం కారులో బుధవారం రాత్రి బెస్తవారిపేట నుండి బయలుదేరారు. చిన్నమాచుపల్లె సమీపంలో టోల్‌గేట్ వద్ద లారీని కారు ఢీ కొనడంతో కారులోని మస్తాన్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మస్తాన్‌రావు భార్య భాగ్యలక్ష్మి ప్రాణాపాయ స్థితిలో ఉండగా, టోల్‌గేట్‌కు సంబంధించిన వాహనంలో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందింది. కారులో ఉన్న బాలరాజు, ప్రసాద్, సురేష్ ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి కడప డీఎస్పీ మాసూంబాషా, సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌లు చేరుకుని ప్రమాదసంఘటనపై ఆరా తీశారు. మృతి చెందిన ఇద్దరినీ శవపరీక్ష నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. గాయపడినవారిని కూడా టోల్‌గేట్ వాహనం ద్వారా రిమ్స్‌కు తరలించారు. చెన్నూరు పోలీసులు కేసునమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ మృతిపై సమగ్ర దర్యాప్తు
గాలివీడు, జూన్ 28: మండలంలోని నూలివీడు గ్రామ పంచాయతీ నాగూరివాండ్లపల్లెకు చెందిన రమాదేవి గండిమడుగుకు సమీపంలో మృతిచెందిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పులివెందుల డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌ను ఆయన సందర్శించి రమాదేవి మృతిపై విచారణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఇంటి నుంచి వెళ్లిపోయిన రమాదేవి వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలో మృతిచెందడం విదితమేనన్నారు. ఈమె మృతిపై భర్త, బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా ఎగువగొట్టివీడు గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన అనాథ పిల్లల ఫిర్యాదు మేరకు పిల్లల తల్లి పార్వతి గల్ఫ్‌కు వెళ్లి ఇంత వరకు ఆమె సమాచారం లేకపోవడంపై విచారణ చేస్తామన్నారు. గల్ఫ్‌కు వెళ్లి ఇబ్బందులు పడేవారికి అదృశ్యమయ్యే వారి కోసం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారని, ఇలాంటి బాధితులందరూ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు. పార్వతి ఫిర్యాదుపై ఆమెను గల్ఫ్‌కు పంపిన ఏజెంటును పిలిపించి విచారించి అనాథ పిల్లలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మండలానికి చెందిన ప్రేమజంటకు కౌనె్సలింగ్ ఇచ్చారు. లక్కిరెడ్డిపల్లె సీఐ రవిబాబు, ఎస్‌ఐలు మంజునాధ్, రవికుమార్, ఏఎస్‌ఐ రెడ్డయ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య, పోలీసు సిబ్బంది పార్థసారథి, మదనకుమార్, గణపతిరాజు పాల్గొన్నారు.