కడప

వైవియు వైస్ చాన్స్‌లర్ పదవి కోసం అధ్యాపకుల క్యూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 30: యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య భేతనభట్ల శ్యామ్‌సుందర్ పదవీకాలం మరో రెండునెలల్లో ముగియనుండటంతో విసి పదవి కోసం పలువురు అధ్యాపకులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. విసి శ్యాంసుందర్ సైతం పదవి పొడిగింపు కోసం ప్రయత్నించడం లేదు. ఆయన హయాంలోనే వైవియుకు నాక్ బిగ్రేడ్ గుర్తింపు లభించింది. ఈ తరుణంలో వైస్‌చాన్సలర్ పదవికోసం అదే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు వాసంతి, ధనుంజయనాయుడు, ఎస్వీ, ఎస్‌కె యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు కిరణ్‌కుమార్ చౌదరి, రెడ్డివెంకటరాజు, సుబ్బరామిరెడ్డి, రాజోలి రామకృష్ణారెడ్డి, రమణయ్య, నారాయణరావులతోపాటు మరికొందరు ప్రభుత్వానికి ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కావడంతో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న అధికారపార్టీ నేతలతో పైరవీలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విశ్వవిద్యాలయంలో విసి పదవిలో కొనసాగాలంటే సామర్థ్యంతోపాటు చాకచక్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అర్హతలు ఉన్న ప్రొఫెసర్‌ను ఎంపిక చేసేందుకు ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో ఎటువంటి రాజకీయా వత్తిళ్లకు లొంగని ప్రొఫెసర్‌ను వైస్ చాన్సలర్‌గా నియామకం చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమీద విసి పదవికోసం ప్రొఫెసర్లు రాజకీయ సిఫార్సులు తారాస్థాయికి చేరాయి. పాలక మండలి సభ్యులు కూడా తమకు అనుకూలమైన వారినే నియమించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.