కడప

టీడీపీతోనే రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, జూలై 17: తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమవుతుందని శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు ఎస్‌వి సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్వగృహంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. దీంతో బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడినప్పటికీ పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అలాగే ఆ పథకాలు అమలు గురించి కూడా స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఎప్పటికప్పుడు వాకబు చేయడం కూడా జరుగుతుందన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి గడప గడపకూ వెళ్లి వివరించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతిపక్ష వైఫల్యం గురించి కూడా వివరిస్తామన్నారు. అభివృద్ధి విషయంలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారికి ఏమైనా కావాల్సిన అవసరాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమార్గాన్ని చూపాలన్నారు. అలాగే నిరుపేదలైన వారందరికీ రేషన్‌కార్డులు, పక్కా గృహాలు, పింఛన్ల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

పేదలందరికీ సంక్షేమ ఫలాలు
* మంత్రి ఆది
రాజుపాళెం, జూలై 17: గడిచిన నాలుగేళ్లలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంచి పరిపాలన అందించారని రాష్ట్ర గిడ్డంగులు, మార్కెటింగ్ శాఖ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మండల పరిధిలోని కుమ్మరపల్లె గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డితో పాటు మంత్రి ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలని, బీసీ కాలనిలలో మంత్రి ఇంటింటికీ తిరిగారు. గడిచిన 1500 రోజుల్లో ప్రజలకు ఫించన్లు, రేషన్‌కార్డులు, ఎన్‌టి ఆర్ పక్కా గృహాలు, తదితర వాటిని పెద్ద ఎత్తున మంజూరు చేశామని మంత్రి తెలిపారు. అంతే కాకుండా ఈ గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. అంగన్‌వాడీలకు గ్రామ సేవకులకు, ఆశా వర్కర్లుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందించిన ఘనత చంద్రబాబునాయుడుకు దక్కుతుందన్నారు. ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలిగాయంటే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. గ్రామ వికాశ్ ద్వారా ప్రజల సమస్యలను అదికారుల ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు.