కడప

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, ఆగష్టు 14: నిరుద్యోగ యువత ఎదుటకు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని ఆర్డీవో కార్యాలయం పక్కన ఉన్న శ్రీనివాస డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రి ఆది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ ఏ విభాగాల్లో అయినా విద్యను పూర్తిచేసుకున్న నిరుద్యోగులు జాబ్‌మేళాలను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ప్రయివేట్ సంస్ధలు, ప్రారంభ వేతనాలు స్వల్పంగా వున్నప్పటికీ మొదటగా ఉద్యోగాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఎక్కడైనా వ్యక్తుల పనితీరు ఆధారంగా వారి ఉన్నతి పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో వివిధ అంశాలపై శిక్షణలను ఇస్తూ నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషిచేస్తోందన్నారు. అయినప్పటకి ఉద్యోగాలు రాని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఏది ఏమైనా మంచి వేతనాలతో ఉద్యోగాల్లో స్ధిర పడేందుకు నిరుద్యోగ యువత పట్టుదలగా కృషిచేయాలని సూచించారు. అనంతరం జాబ్ మేళాకు విచ్చేసిన సంస్ధలు తమ పరిధిలో కల్పించే ఉద్యోగావకాశాలను, పరిస్ధితులను వివరించారు. జాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అవసరాల మేరకు ఎంపికల ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మిరాజ్యం, మున్సిపల్ కౌన్సిలర్ టి.సూర్యనారాయణరెడ్డి, కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువత, ప్రజలు పాల్గొన్నారు.