కడప

కుట్ర, కుతంత్రాలకు మారుపేర్లు చంద్రబాబు, మోదీ: ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, ఆగస్టు 14: కుట్రలు, కుతంత్రాలకు మారుపేర్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని మోదీ నిలుస్తారని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాబలంతో రాజకీయంగా ఎదుగుతున్న వంటి నాయకులను చూస్తే అటు మోడీకి, ఇటు చంద్రబాబులకు ఈర్ష్య మొదలవుతుందన్నారు. ప్రజాబలం ఉన్న నాయకులను అణచివేయడం కోసం ఎంతకైనా వీరు దిగజారుతున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి లాలూచీపడి ఏడు సంవత్సరాల క్రితం కక్షపూరిత స్వార్థంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆయన గుర్తు చేశారు. బయట ప్రకటనలకేమో మోడీ, చంద్రబాబులు విమర్శించకున్నట్లు డ్రామాలాడుతూ ప్రజాబలంతో జగన్ ముందుకెళ్తున్నారన్న భయంతో ఎటువంటి సంబంధం లేని వైఎస్ భారతీని అక్రమ కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 30 సంవత్సరాల నుంచి వైద్యసేవలు అందిస్తున్న వైద్య దంపతుల కుమార్తె అయిన భారతీ పవర్‌ప్లాంటు ప్రాజెక్టులతో సమా అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్నారన్నారు. తన కంపెనీలో నుంచి కోట్ల రూపాయల జీతం తీసుకుంటోందని నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. మరి ఇదే మీడియా రెండు సంవత్సరాల క్రితం వ్యాపారం ప్రారంభించినటువంటి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి రూ.9.5 కోట్లకు పైగా జీతం తీసుకుంటున్న విషయం గురించి అక్షరం ముక్క రాయరన్నారు. ఏదో రకంగా వైఎస్ కుటుంబాన్ని అవమానించాలన్న పద్ధతిలోనే ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందన్నారు. ప్రజాభిమానం పొందిన వైఎస్ కుటుంబాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో పూర్తి స్థాయిలో కరవు ఉన్నా పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తామన్న నాయకులు 2 నెలల నుంచి నీళ్లు తోడి అనుకున్నటువంటి ప్రాంతానికే తరలిస్తున్నారే కానీ రాయలసీమ గురించి అణువంత ఆలోచన చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ జిల్లాలో అనేక ప్రాజెక్టులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయాంలో ఒక రూపుకు వచ్చాయని, టీడీపీ హయాంలో ఏ ఒక్క చిన్న పనిని కూడా చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ కాలం వెలిబుచ్చుతున్నారని ఆయన దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ బతికి ఉండి ఉంటే ఏడెనిమిది ఏళ్ల క్రితమే కృష్ణా జలాలతో రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసి ఉండే వారన్నారు. కరవును పారదోలడం కోసం ఇప్పటికైనా ఈ ప్రాంతాలకు వెంటనే కృష్ణా జల్లాలను యుద్ధ ప్రాతిపదికన తీసుకురావాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.