కడప

సోషియల్ మీడియా వదంతులను నమ్మవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, ఆగస్టు 17: ప్రజలు సోషియల్ మీడియా ద్వారా వచ్చే వదంతులను నమ్మరాదని కడప ఓఎస్డీ నరుూమ్‌అద్నాన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో శాంతి సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓఎస్డీ మాట్లాడుతూ తాను కశ్మీర్ నుండి కడపకు వృత్తిరీత్యా రావడం జరిగిందన్నారు. త్వరలో జరగబోయే బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ సమావేశాన్ని హిందూ, మహమ్మదీయులతో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇకపోతే సుప్రీం కోర్టు ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో సోషియల్ మీడియా ద్వారా వచ్చే వదంతులను నమ్మవద్దని, వాస్తవాలు తెలుసుకొని ప్రజలు ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా కలదన్నారు. అనంతరం అడిషనల్ ఏఎస్పీ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ రాయచోటి ప్రాంతంలో చాలా సున్నితమైన అంశం కూడా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని, అలా కాకుండా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. కులమతాలకు అతీతంగా హిందూ మహమ్మదీయులు సోదరభావంతో మెలగాలని ఆయన సూచించారు. అనంతరం పులివెందుల డీ ఎస్పీ నాగరాజ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈర్ష్యా ద్వేషాలు పక్కన పెట్టి మనష్యులుగా నడుచుకోవాలన్నారు. పండుగలను సంతోషంగా జరుపుకోవాలని అందుకు తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవించాలన్నారు. అంతేకాకుండా గోవధపై నిషేధం ఉందని ఇందుకు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా కలదన్నారు. గోవధ నిర్మూలనకు తాము తీసుకునే చర్యలన్నీ తీసుకుంటామన్నారు.