కడప

సుండుపల్లెలో హీరా బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండులపల్లె, ఆగస్టు 17: హీరా గ్రూప్‌లో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో వడ్డీ రూపంలో నెలా నెలా వస్తుందని ఆశతో సుండుపల్లె మండల వ్యాప్తంగా మైనార్టీలు కోట్ల రూపాయలను హీరా సంస్థలో డిపాజిట్ చేశారు. అయితే నెల నెలా తమకు వడ్డీ చెల్లిస్తున్నారని అయితే మూడు నెలలు గా వడ్డీ ఇవ్వకుండా నానా సాకులు చెబుతున్నారని పలువురు వాపోతున్నారు. తమ డబ్బుకు దిక్కెవరని పలువురు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని సుండుపల్లె, రాయవరం, జికె రాచపల్లె, బెస్తపల్లె, మడితాడు, తిమ్మసముద్రం గ్రామాల నుండి అనేక మంది లక్షల రూపాయలు డిపాజిట్లు చేసి ఉండగా ఒక రాయవరం సుండుపల్లె గ్రామాల్లోనే సుమారు రూ.10 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా వడ్డీ డబ్బులు చెల్లించేవారని వడ్డీ డబ్బులు రాకపోగా హైదరాబాద్‌లో ఆ సంస్థను మూసేసినట్లు ఆ సంస్థపై పలు రాష్ట్రాలలో కేసులు నమోదైనట్లు మీడియా ద్వారా తెలుసుకొని ఒక్కసారిగా సుండుపల్లె వాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాము కూలీ, నాలి చేసుకొని అంతో, ఇంతో దాచుకున్న మొత్తం హీరా గ్రూపులో పెట్టామని, ఈ కంపెనీ తమను నిండా ముంచుతుందని గ్రహించలేదని కొందరు పాత్రికేయుల ముందు వాపోతున్నారు. మరి కొంత మంది సెప్టెంబర్ మొదటి వారంలో తమకు వడ్డీ డబ్బులు తమ ఖాతాలలో జమ అవుతాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కొంత మంది భూములు సైతం అమ్మి తాకట్టు పెట్టి హీరా సంస్థలో డబ్బులు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. అయితే రాయవరం గ్రామానికి చెందిన ఓ మైనార్టీ సోదరుడు కోటి రూపాయలను హీరా గ్రూప్‌లో పెట్టాడని, అయితే వడ్డీ డబ్బులకు ఆశపడి ఆస్థులను సైతం అమ్మి మరికొంత మంది డిపాజిట్లు చేయడం వలన ఆ కుటుంబాలు వీధినపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండల కేంద్రంలో సైతం పలువురు మహిళలు కూడా ఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. హీరాలో మొత్తం సుమారు రూ.30 కోట్లను సుండుపల్లె వాసులు పెట్టుబడులు పెట్టినట్లు అనధికారికంగా సుండుపల్లెలో ప్రచారం సాగుతోంది. బాధితుల గతేమిటో అర్థం కావడం లేదని మండలంలో చర్చనీయాంశంగా మారింది.