కడప

రెవెన్యూశాఖలో పనిచేయని ఆన్‌లైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 17: జిల్లా వ్యాప్తంగా మూడువారాలుగా ఆన్‌లైన్ పనిచేయలేదంటూ రెవెన్యూ అధికారులు చేతులెత్తేశారు. గత మూడువారాలుగా ఆన్‌లైన్ అందుబాటులోకి రాలేదు. ఫలితంగా ఆన్‌లైన్‌లో అనేక సమస్యలను రెవెన్యూకు సమర్పించేందుకు రైతులతోపాటు ఇతరులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో రెవెన్యూ యంత్రాంగం కూడా చేతులెత్తేసింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే వేలాదిగా రైతులకు సంబంధించిన ఆన్‌లైన్ సమస్యలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ ఆన్‌లైన్ ఓపెన్ కావడం లేదు. ఇందుకు ప్రధానంగా రైతులు తమ భూముల సమస్యలపై ఆన్‌లైన్ చేయించుకునేందుకు పెద్ద ఎత్తున రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఆన్‌లైన్ నిలచిపోవడం, అనేక మంది భూ బాధితులు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఈనెల మొదటివారం నుండి భూములకు రేట్లు పెరిగాయి. రిజిస్ట్రేషన్ ధరలు భారీగా పెరిగాయి. ఈనేపధ్యంలో ఈ ధరలు పెరుగుతుండటంపై గమనించిన రైతులు గతనెలలో భారీ ఎత్తున భూముల అమ్మకాలు, కొనుగోళ్లు సాగించారు. అలాగే చుక్కల భూములున్న రైతులు కూడా ఆన్‌లైన్‌లో మార్పుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూకు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సివుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్ పనిచేయకపోవడంతో ఎక్కడికక్కడ రైతుల సమస్యలతోపాటు అనేక కీలకమైన ఆన్‌లైన్ సేవలు కూడా నిలిచిపోయాయి. అధికారులు ఏమీ చెప్పలేక ఆన్‌లైన్ వస్తుందో లేదో చూద్దామంటూ బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అయినప్పటికీ ఏరోజుకారోజు ఆన్‌లైన్ పనిచేయడం లేదంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే భూ బాధితులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటూ రెవెన్యూశాఖపై తీవ్రస్థాయిలో వత్తిడి కొనసాగుతోంది. ఈనేపధ్యంలో ఎక్కడికక్కడ వారాల తరబడి ఆన్‌లైన్ పనిచేయకపోవడంతో రెవెన్యూశాఖ కూడా ఆన్‌లైన్ పనిచేస్తే మేం చేస్తాం లేకపోతే మేమేం చేస్తామంటూ చేతులెత్తేస్తున్నారు. దీనికితోడు భూముల లావాదేవీలు,అమ్మకాలు, కొనుగోళ్లపై పాసుపుస్తకాలు, అడంగళ్లు, వన్-బి వంటివి ఆగిపోయాయి. దీంతో భూములు కొన్నవారు, అమ్మినవారు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూ లావాదేవీల్లో రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ రెవెన్యూశాఖలో ఆన్‌లైన్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దీని ఫలితంగా కొన్నవారు, అమ్మినవారు ఆర్థికపరమైన లావాదేవీల్లో వివాదాస్పద పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేగాకుండా కొత్త రేషన్‌కార్డుల వ్యవహారంలో కూడా ఆన్‌లైన్ పనిచేయడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం కొత్తవారికి రేషన్‌కార్డులు అందజేస్తామని ప్రకటించినప్పటికీ మండల కార్యాలయాల్లో ఆన్‌లైన్ ఓపెన్ కావడం లేదంటూ సిబ్బంది ఏమీ చెప్పలేకపోతున్నారు. దీంతోపాటు రేషన్‌కార్డులో పేర్ల చేర్పు, తొలగింపు లాంటివి కూడా జరగడం లేదు. దీంతో లబ్ధిదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నెలకొన్న ఆన్‌లైన్ బ్రేక్ వ్యవహారం జిల్లా యంత్రాంగానికే గాకుండా బాధితులకు కూడా తలనొప్పిగా మారిందని చెప్పక తప్పదు.