కడప

బుడగ జంగం వాసుల సమస్య పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, ఆగస్టు 17: పట్టణంలోని నాగలకట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న బుడగజంగం వాసుల సమస్యలను పరిష్కారానికి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి సి. ఆదినారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంకు బుడగజంగం వారిని మంత్రి ఆది పిలిపించుకొని వారి సమస్యలపై చర్చించారు. గత 20 ఏళ్లుగా పట్టణంలోని నాగలకట్ట ప్రాంతంలో ఉంటున్నామని, తమకు ప్రభుత్వ పథకాలు మంజూరు చేయించి న్యాయం చేయాలని బుడగజంగాలు కోరారు. విషయంపై స్పందించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన బుడగజంగం వారికి తప్పనిసరిగా న్యాయం చేస్తామన్నారు. స్థలం ఉన్న వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న హౌసింగ్ పథకం క్రింద ఇళ్లు మంజూరు చేయిస్తామన్నారు. అలాగే స్థలాలు లేని వారికి రూరల్ ప్రాంతంలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణాలు చేయిస్తామని మంత్రి బుడగజంగం వారికి హామీ ఇచ్చారు. ఏళ్ల నుండి ఉన్న తమ సమస్యకు మంత్రి ఆది హామీతో పరిష్కారం అవనుందని బుడగజంగం వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చైర్‌పర్సన్ టి.తులసి, కౌన్సిలర్ సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

టీడీపీ ప్రభుత్వహయాంలో పెచ్చుమీరిన అవినీతి:వైసీపీ
సిద్దవటం,ఆగస్టు 17: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి పెచ్చుమీరిందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి అన్నారు. మండలంలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం 5సంవత్సరాల కాలం పూర్తిచేసుకున్న సర్పంచ్‌లకు వైసీపీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలు వైసీపీ సర్పంచ్‌లకు అధికారాలు లేకుండా జన్మభూమి కమిటీల ద్వారా నరకాసుడి పాలన అందించారన్నారు. ప్రభుత్వ పథకాలు టీడీపీ అనుయాయులకే దక్కేలా చేశారని విమర్శించారు. ఐదేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకున్న సర్పంచ్‌లకు కనీసం సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటుచేయకుండా చంద్రబాబునాయుడు సన్మానాలు చేయించుకుంటుండటం దారుణమన్నారు. అందుకోసమే వైసీపీ ఆధ్వర్యంలో రాజంపేట మండలాల్లోని సర్పంచులకు చిరుసత్కారాల కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మాజీ సర్పంచ్‌లు టక్కోలు సర్పంచ్ పద్మావతి, మాచుపల్లె సర్పంచ్ వేల్పులరాజా, పెద్దపల్లె సావిత్రమ్మ, నేకనాపురం సర్పంచ్ చిన్నవెంకటసుబ్బారెడ్డి, శాఖరాజుపల్లె సర్పంచ్ వెంకటరమణ, వంతాటిపల్లె సర్పంచ్ సుబ్బలక్షుమ్మ, జ్యోతి సర్పంచ్ ఈశ్వరమ్మలకు సన్మానం చేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు నీలకంఠారెడ్డి, రైతు విభాగం నాయకుడు సుబ్బరామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, వలీచాన్, సుబ్బారెడ్డి, శోభన్‌రెడ్డి, ఎల్లారెడ్డి, కెవి సుబ్బయ్య, చైతన్య, బూచి వెంకటరమణారెడ్డి, కెవి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు 6,245 వ్యవసాయ సర్వీసులడు మంజూరు
* రైతుల సంక్షేమంపై దృష్టిపెట్టిన ట్రాన్స్‌కో
కడప అర్బన్,ఆగస్టు 17: జిల్లాలో రైతులకు మరిన్ని వ్యవసాయ సర్వీసులు ఇచ్చి పంటల సాగుబడిని, దిగుబడిని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్‌సరఫరా సంస్థ జిల్లాకు 6,245 వ్యవసాయ సర్వీసులను మంజూరు చేసింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అతివృష్టి, అనావృష్టి నుంచి రైతులను గట్టెక్కించి నిరంతరం 7గంటలు విద్యుత్ సరఫరా చేసి సాగుపంటలకు సాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు ఇచ్చిన సర్వీసు లక్ష్యాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు ట్రాన్స్‌కో ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫారం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ సీనియార్టి ప్రాతిపదికన ట్రాన్స్‌ఫార్మార్లు అందజేసేందుకు ట్రాన్స్‌కో రైతుల వద్ద నుంచి వ్యవసాయ పట్టాదారు పాసుపుస్తకాలు జిరాక్స్‌కాపీలు తీసుకోనుంది. నాణ్యమైన విద్యుత్‌ను, లోవోల్టేజిని అధికమించేందుకు జిల్లాలో రైతులకు విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు జిల్లాకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసింది. వ్యవసాయ పంపుసెట్లకు ఇచ్చిన సర్వీసు లక్ష్యాన్ని పూర్తిచేయాలని ఇప్పటికే రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ సీఎండీ ఎంఎం నాయక్‌ను ఆదేశించారు. ఈనేపధ్యంలో భాగంగా జిల్లాలోని ఆయా డివిజన్లకు కేటాయించిన సర్వీసులు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం లేకుండా ట్రాన్స్‌కో చర్యలు చేపట్టింది. ట్రాన్స్‌ఫార్మార్లు గోదాముల నుంచి మండల స్థాయి కార్యాలయాలకు తీసుకెళ్లి దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ అందించనుంది. ఇటీవల గత వారం రోజుల కిందట గోదాముల నుంచి విద్యుత్ నియంత్రికలను తీసుకెళ్లాలని డీఈలను, ఈఈలను సీడీఎం ఆదేశించారు. అలాగే వినియోగదారుల బిల్లులన్నీ ఆన్‌లైన్‌లో జరిగేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికీ 20శాతం మాత్రమే జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్‌ను రైతులు వినియోగించుకుంటున్నారు. 100శాతం సాధించేందుకు ట్రాన్స్‌కో అధికారులు కసరత్తు ప్రారంభించారు. వ్యవసాయ, గృహేతర, గృహావసర బిల్లులన్నింటినీ ఆన్‌లైన్‌లో చెల్లింపులకు ప్రక్రియ వేగవంతం చేసేందుకు ట్రాన్స్‌కో ప్రణాళికలు రూపొందించింది. అలాగే గ్రామాల్లో ప్రజలకు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు గ్రామసభలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. విద్యుత్ సర్వీసుల లక్ష్యం పూరించేందుకు, వినియోగదారులకు వ్యవసాయానికి, గృహావసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్‌శాఖ కంకణం కట్టుకుంది.