కడప

రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, సెప్టెంబర్ 21: రైతులను ఆదుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నగొల్లపల్లె, చండ్రాజుగారిపల్లెతో పాటు పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. జగన్ రావాలి.. జగన్ కావాలి.. అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వర్షాలు లేక రైతులు నష్టాలబాటలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. మరో పది నెలల్లో జరగబోయే ఎన్నికలలో వైకాపా అఖండ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రాష్ట్రంలో జగన్‌కు పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేకనే టీడీపీ నాయకులు జగన్‌ను విమర్శిస్తున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రం సమస్యల కూపంగా మారినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆరోపించారు. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 8 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని తెలిపారు. అనంతరం చండ్రాజుగారిపల్లె ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడారు.