కడప

బస్‌షెల్టర్ కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 21: పాత బస్టాండులో ప్రయాణికులు సేదతీరుతున్న బస్‌షెల్టర్‌ను అధికారుల ప్రమేయం లేకుండా కూల్చివేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 30 గ్రామాలకు సంబంధించిన ప్రజలు రాకపోకలు చేస్తూ పాత బస్టాండులో సేదతీరుతూ బస్సు ఎక్కే తమ ఊర్లకు ప్రజలకు చేరుకునేవారన్నారు. అలాంటి బస్స్ షెల్టరును మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తన అనుచరులతో వచ్చి కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. పైగా బస్ షెల్టర్ చుట్టూ చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నా పేదల బంకులను ఉన్నఫలంగా కూల్చీ వేయడం వారి ఆస్తులకు నష్టం కలిగించడం సమంజసం కాదన్నారు. మునిసిపల్ అధికారులను అడుగగా తమకెలాంటి సమాచారం లేదన్నారని, దీంతో తాను గురువారం కలెక్టర్‌ను కలిసి బస్ షెల్టర్‌ను కూల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వల్ల ప్రొద్దుటూరులో ప్రజలు వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురౌతున్నారన్నారు. వరదరాజులరెడ్డి పాత బస్టాండును కూల్చివేస్తే అదే పార్టీలో ఉన్నటు వంటి మరోక వర్గం బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొనడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల వ్యవహారం రెండు నాలుకల దోరణిలా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. పాత బస్టాండును కూల్చివేసిన వారిపై కేసులు నమోదు చేయని పక్షంలో త్వరలో తాను ఆమరణ దీక్ష చేపట్టి ఆందోళన చేస్తానని హెచ్చరించారు.