కడప

అర్హులైనందరికీ ఓటు హక్కు... * కలెక్టర్ సి.హరికిరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 24: ఇంటింటికీ తిరిగి నమోదు చేస్తున్న ఓటరు నమోదు కార్యక్రమంలో, ఓటు హక్కుకు అర్హులైన అందర్నీ నమోదుచేయాలని కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. నవంబర్ 30వ తేదీ చివరి తేదీ అని చెబుతూ, ఇంటింటికీ తిరుగుతున్న సిబ్బందికి ప్రజలు కూడా సహకరించాలని కలెక్టర్ అన్నారు. సోమవారం వివిద శాఖాధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పకడ్బంధీగా అమలు చేయాలని హితవుపలికారు. క్షేత్రస్థాయి సిబ్బంది అన్నిశాఖల సమన్వయంతో ఇంటింటా తిరిగి కొత్త ఓటర్ల నమోదును పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో 18సంవత్సరాలు వయస్సు నిండిన యువతీ యువకులను నమోదు చేయించుకునేందుకు చైతన్యం చేయాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో బీఎల్‌వోలు విధులకు హాజరయ్యేందుకు ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, మెప్మా, వైద్యశాఖాధికారుల సహకారం తీసుకోవాలని కోరారు. నమోదు కార్యక్రమంపై కరపత్రాలు, ప్లక్సీలు గ్రామాల్లో, పట్టణాల్లో టాం టాం నిర్వహించి ఓటర్ల నమోదుకు అర్హులను చైతన్యవంతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో అధికారులందరూ సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. తిరుపతిలో అక్టోబర్ 4వ తేదీ జాతీయ ఎస్సీ కమిషన్‌చే రాయలసీమ జిల్లాల సమావేశం జరుగుతుందని, అందుకు అధికారులందరూ నివేదికలు, ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాలు ఖచ్చితంగా వందశాతం పూర్తిచేయాలని కోరారు. అంగన్వాడీ భవనాలతోపాటు అందులో వౌళిక సదుపాయాలు మెరుగుపరచాలని తెలిపారు. మైక్రో ఇరిగేషన్‌పై రైతులను చైతన్యం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేసీ కోటేశ్వరరావు, జేసీ-2 శివారెడ్డి, ట్రైనీ కలెక్టర్ గోపాలకృష్ణ, ఏపీఎంఐపీ పీడీ మధుసూధన్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ హరిహరనాధ్, అధికారులు పాల్గొన్నారు.