కడప

అటవీ గోడౌన్ నుంచి దుంగలు చోరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బద్వేలు, సెప్టెంబర్ 24: బద్వేలులోని అగ్నిమాపకశాఖ గోడౌన్‌లోని ఎర్రచందనం దుంగలు చోరికి గురికావడంపై సర్వాత్రా చర్చనీయాంశం అయ్యింది. ఫారెస్ట్ బంగళా పరిధిలో గోడౌన్‌లో నిలువ ఉంచివున్న ఎర్రచందనం దుంగలను చోరికావడాన్ని బట్టిచూస్తే దీనివెనుక ఇంటి దొంగలు సహకరించి ఉంటారన్నా అనుమానం తలెత్తుతుంది. గతంలో కూడా ఫారెస్టు బంగళాపరిధిలో ఎర్రచందనం దుంగలు చోరికికావడం సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై స్థానిక ఫారెస్టు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ప్రొద్దుటూరు డీఎఫ్‌ఓ డి.ప్రభాకర్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన లంకమల్ల రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని తిమ్మాయకుంట ప్రదేశంలో 566 కేజీల 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఒక నిందితున్ని అరెస్టు చేశామని తెలిపారు. అనంతరం ఆ దుంగలను అదే రోజు మధ్యాహ్నం స్థానిక బద్వేలులోని ఫారెస్టు గోడౌన్‌లో ఉంచామని తెలిపారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బద్వేలులోని పట్టుబడిన ఎర్రచందనం దుంగలను తిరుపతి సెంట్రల్ డిపోకు తరలించారన్న ఉద్ధేశ్యంతో పరిశీలించగా గోడౌన్‌లో దుంగలు చోరికాబడ్డాయని గుర్తించామని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా డాగ్ స్వ్కాడ్ కూడావచ్చి పరిశీలించిందని తెలిపారు. ఈ సంఘటనలో ఇంటి దొంగల హస్తం ఉన్నదా, బయటినుంచి ఎవ్వరైనా సహకరించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని నిందుతులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ముందుగా అర్బన్ ఎస్‌ఐ చలపతి, ఎఫ్‌ఆర్‌ఓ ఫారెస్టు గోడౌన్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో మైదుకూరు డియస్‌పి శ్రీనివాసులు, బద్వేలు అర్బన్, రూరల్ సీఐలు రెడ్డప్ప, రమేష్‌బాబు, ఎస్‌ఐ చలపతి, తదితరులు పాల్గొన్నారు.