కడప

ఎస్సీ ‘కులాంతర’ప్రోత్సాహం పెంపుయోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,సెప్టెంబర్ 25: కులాంతర వివాహాలు చేసుకునే ఎస్సీలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు కులాంతర వివాహం చేసుకునే వారికి ప్రోత్సాహకంగా అందించే ఆర్థికసాయాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న రూ.50వేల సాయాన్ని రూ.2.50లక్షలకు పెంచాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ఇటీవల సాంఘిక సంక్షేమశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. వాస్తవానికి అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ కులాంతర వివాహాలు ఏటా తగ్గుతూ వస్తున్నాయి. జిల్లాలో అదే పరిస్థితి నెలకొంది. 2016-17వ సంవత్సరంలో 93మంది జంటలు కులాంతర ప్రోత్సాహానికి దరఖాస్తు చేసుకోగా 93మందికి ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున రూ.46లక్షల 10వేలు నగదును ప్రోత్సాహకంగా ఇచ్చారు. అలాగే 2017-18 సంవత్సరానికి 26మంది కులాంతర వివాహ జంటలు దరఖాస్తు చేసుకోగా 21మందికి మాత్రమే 50వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని సాంఘిక సంక్షేమశాఖ అందించింది. మిగతా ఐదుమంది జంటలకు అసిస్టెంట్ సోషియల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణలో భాగంగా దరఖాస్తులు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం కులాంతర వివాహ దంపతులకు తొలుత రూ.10వేలు ఇస్తుండగా ఆ తర్వాత దాన్ని రూ.50వేలకు పెంచారు. ఈ మొత్తాన్ని రూ.4లక్షల వరకు పెంచాలని దళిత సంఘాలు, కులాంతర వివాహ సంఘం నాయకులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కానీ ప్రభుత్వం ఆప్రోత్సాహక పెంపును పెంచలేదు. కులాంతర ప్రోత్సాహకంగా కేంద్రం రూ.2.50లక్షలు మంజూరు చేయగా, రాష్ట్రం నుండి రూ.50వేలు మంజూరు చేస్తుంది. అయితే కేంద్రప్రోత్సాహకం పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ ఆఫీసు చుట్టూ తిరగలేనివారు, వారు అడిగిన దరఖాస్తులు అందచేయనివారు దరఖాస్తులు చేసుకోవడం లేదు. చాలామంది దరఖాస్తు చేసుకున్న కేంద్రం నుంచి సాయం అంతంతమాత్రమే అందుతుందని కులాంతర వివాహ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వపరంగా వీరికి సరిపడినంత సాయం అందకపోవడం వీరిలో చదివి వుంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించకపోవడం, ఇంటిస్థలంతోపాటు గృహనిర్మాణం నిర్మించకపోవడం, సామాజిక పరంగా కులాంతర వివాహ దంపతులకు ఆర్థికంగా ఆటుపోట్లు ఎదురౌతున్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చట్టాల్లోని లొసుగులు అడ్డుపెట్టుకుని సమన్యాయం కల్పించడంలో విఫలవౌతున్నారన్న ఆరోపణలు వారి వైపు నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం సరిపోకపోవడంతో, ఏదైనా వ్యాపారం పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుందామంటే పెట్టుబడి లేకపోవడం, పరపతి పుట్టకపోవడం వంటి అన్ని వీరిని వెంటాడుతున్నాయి. అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులు ప్రతిరోజు జిల్లాలో ఏదో ఒకచోట ఆత్మహత్యలు, పోలీసుస్టేషన్లను ఆశ్రయించడం జరుగుతూనే ఉంది. సామాజికపరంగా, ఆర్థికపరంగా కులాంతర వివాహ దంపతులను ఆదుకుని భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.