కడప

1.72లక్షల హెక్టార్లలో పంట సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 25: రబీసీజన్‌లో జిల్లా వ్యాప్తంగా లక్షా 72వేల 191హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ మురళీ కృష్ణ వెల్లడించారు. మంగళవారం కడపలోని కలెక్టరేట్‌లోని వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018-19నాటికి రబీసీజన్‌లో సాధారణ విస్తీర్ణం ఒక లక్షా 72,191 హెక్టార్లు సాగుకావాల్సివుందన్నారు. ఇందులో శెనగ 84,719హెక్టార్లు, వేరుశెనగ 16,650 హెక్టార్లు, నువ్వులు 7,474 హెక్టార్లు, మినుములు 7,149 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పంటలసాగుకు కావాల్సిన విత్తనాలు అందించేందుకు వ్యవసాయశాఖ కమిషనర్ అనుమతికి నివేదికలు పంపామన్నారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం నుండి మన జిల్లాకు 65వేల క్వింటాళ్ల శెనగలు , 4వేల క్వింటాళ్ల వేరుశెనగ, 100క్వింటాళ్ల మినుములు, 250క్వింటాళ్ల నువ్వులు మంజూరయ్యాయన్నారు. ఇవి కాకుండా అదనంగా విత్తనాల మంజూరుకోసం రాష్ట్ర అధికారులతో చర్చించామని దీంతో 40వేల క్వింటాళ్ల శెనగలు, కే-6 రకం 2వేల క్వింటాళ్ల వేరుశెనగలు, మినుములు 250 క్వింటాళ్లు కావాలని ప్రతిపాదించామన్నారు. అలాగే శెనగకు 50శాతం, వేరుశెనగకు 40శాతం, మినుముకు 30శాతం, నువ్వులు 50శాతం, సబ్సిడీతో విత్తనాలు అందజేస్తామన్నారు. మండలాల వారీగా విత్తనాలు పంపిణీ చేస్తామని, ఎక్కడికక్కడ ఎమ్మార్పీ ధరకు విత్తనాల అమ్మకాలు సాగిస్తామని, అధిక ధరలకు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో 90శాతం ఈ-పంట నమోదు చేయడం జరిగిందన్నారు. రైతులందరూ ఈ-పంటలో నమోదుచేసుకుని ప్రభుత్వసహాయాన్ని లబ్దిపొందాలన్నారు. విత్తన పంపిణీలో ఎలాంటి సమస్యలున్నా, 1077 అనే టోల్‌ఫ్రీకి ఫోన్‌నెంబర్ చేయవచ్చునని ఆయన వెల్లడించారు.